Telangana

News July 1, 2024

NZB: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్

image

భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో కలత చెంది ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందారు. ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన సుద్ధపల్లి చంద్రన్న(47) వ్యక్తి కొంతకాలంగా నవీపేట మండలం జన్నేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News July 1, 2024

వరంగల్: ఈరోజు పత్తి ధర రూ.7,160

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునఃప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలిరాగా.. ధర మాత్రం గత వారంలాగే రూ.7,160 పలికింది. పత్తి ధర పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. కాగా, మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంన్నది.

News July 1, 2024

పటాన్‌చెరు: తల్లి మందలింపు.. బాలుడి అదృశ్యం

image

స్కూల్‌కి వెళ్లమని మందలించినందుకు బాలుడు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జహీరాబాద్ వాసి స్వరూప భర్తతో గొడవపడి పటాన్‌చెరు మండలం ముత్తంగిలో వేరుగా ఉంటోంది. ముగ్గురు కుమారుల్లో 2వ వాడు ఇమాన్యూయల్(9)ను శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లడానికి సిద్ధంకమ్మని మందలించింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News July 1, 2024

పోలీసులు అనుమతి తప్పనిసరి: నిర్మల్ ఎస్పీ

image

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్‌ను సోమవారం నుంచి అమలుచేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు ,ర్యాలీలు నిర్వహించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 1, 2024

జగిత్యాల: నేటి నుంచి నూతన చట్టాలు అమలు

image

నేటి నుంచి నూతన చట్టాలు అమలులోకి వస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన న్యాయ, నేర చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. దేశ అంతర్గత భద్రతలో కొత్త చట్టాలు నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసుశాఖకు చెందిన డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

News July 1, 2024

NLG: ఇక క్యూఆర్ కోడ్ తోనే చెల్లింపులు!

image

మీ-సేవా కేంద్రాల్లో రెవెన్యూ పరమైన సేవలన్నింటికీ నగదు రహిత చెల్లింపులను తప్పని సరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 1 నుంచి ఈ నూతన విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలిస్తుండటంతో ఇక మీదట ప్రైవేటు కేంద్రాల్లోనూ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా రుసుం వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News July 1, 2024

NLG: జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం షురూ కాకముందే  డెంగీ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడం డెంగీ వ్యాప్తి ఉధృతికి అద్దం పడుతోంది. నల్గొండ నియోజకవర్గంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News July 1, 2024

రోడ్డుప్రమాదం, డీఏఓ పరీక్షలకు దూరమైన అభ్యర్థులు

image

సత్తుపల్లిలోని డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష రాసేందుకు దాదాపు 20 మంది అభ్యర్థులు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరగడంతో కొందరు గాయాలపాలయ్యారు. చికిత్స కోసం వారిని పీహెచ్సీకి తరలించగా పరీక్ష సమయం దాటిపోవడంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరం అయ్యారు. మరి కొందరిరి గాయాలైనా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. 3 సంవత్సరాలుగా పరీక్షలకి ప్రిపేర్ అయ్యామని మధ్యలో ఇలా జరిగిందని వారు వాపోతున్నారు.

News July 1, 2024

MBNR: 3,929 మంది టీచర్లకు స్థాన చలనం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే 1,725 మంది SAలకు బదిలీ అయ్యారు. మరో 1,975 మంది SGTలు SAలుగా, 229 మంది SAలు GHMలుగా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో 3,929 మంది ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. ప్రస్తుతం ఎస్జీటీల బదిలీలతో మరో రెండు వేల మందికి స్థాన చలనం కలగనుంది. ఒకే పాఠశాలలో 8ఏళ్ల పాటు పనిచేసిన SGTలు విధిగా మరో పాఠశాలకు బదిలీ కానున్నారు.

News July 1, 2024

సైబరాబాద్ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!

image

ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరాంఘర్ చౌరస్తా, పీడీపీ కూడలి, దుర్గానగర్ కూడలి, పిల్లర్ నంబర్ 294 కూడలి, పిల్లర్ నంబర్ 202, బన్సీలాల్‌నగర్, ట్రిపుల్ ఐటీ కూడలి, శేరిలింగంపల్లి గుల్మొహర్ కూడలి, కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు, ఖాజాగూడ, రాడిసన్ డీఎల్ఎఫ్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, ఖానామెట్, గూడెన్మెట్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.