Telangana

News June 30, 2024

లోకేశ్వరం: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పొలీసులు వివరాల ప్రకారం.. సేవాలాల్ తండాకు చెందిన పవార్ కృష్ణ (28) మద్యానికి బానిసై అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పవర్ అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ASI దిగంబర్ తెలిపారు.

News June 30, 2024

HYD: వెంకయ్య నాయుడు జీవన యాత్రపై పుస్తకావిష్కరణ

image

HYDలోని రాజ్ భవన్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లైఫ్ జర్నీపై ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్ భవన్ వద్ద ఈ కార్యక్రమం జరగగా.. ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

News June 30, 2024

HYD: వెంకయ్య నాయుడు జీవన యాత్ర పై పుస్తకావిష్కరణ

image

HYDలోని రాజ్ భవన్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లైఫ్ జర్నీపై ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్ భవన్ వద్ద ఈ కార్యక్రమం జరగగా.. ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

News June 30, 2024

కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన డిప్యూటీ సీఎం

image

మధిర మండలం మర్లపాడులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో అనర్హులు కూడా పథకాలు అందజేశారని, తాము అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందజేస్తామని తెలిపారు.

News June 30, 2024

HYD: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

image

మనస్తాపంతో ఉరేసుకొని 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై డి.సుబాష్ వివరాల ప్రకారం.. లింగంపల్లిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న గణేశ్‌ కూతురు రుకిత(12) ఏడో తరగతి చదువుతోంది. కామారెడ్డిలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి తీసుకువెళ్తామని చెప్పి తీసుకెళ్లలేదు. దీంతో మనస్తాపానికి గురైన రుకిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News June 30, 2024

HYD: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య 

image

మనస్తాపంతో ఉరేసుకొని 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై డి.సుబాష్ వివరాల ప్రకారం.. లింగంపల్లిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న గణేశ్‌ కూతురు రుకిత(12) ఏడో తరగతి చదువుతోంది. కామారెడ్డిలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి తీసుకువెళ్తామని చెప్పి తీసుకెళ్లలేదు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని రుకిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News June 30, 2024

HYD: చేజింగ్‌ చేసిన ఎస్‌టిఎఫ్‌.. డ్రగ్స్ స్వాధీనం

image

ఉత్తరఖాండ్‌ నుంచి సిటీకి తీసుకు వస్తున్న లక్షన్నర విలువ గల హషిష్ అనే డ్రగ్స్‌ను సినిమా పక్కిలో చేజింగ్ చేసి ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ టీమ్‌ పట్టుకున్నారు. కీసర రాంపల్లికి చెందిన రిత్విక్‌.. ఉత్తరాఖాండ్‌ ‌కు వెళ్లి అక్కడ కొంత కాలం ఉన్నారు. తిరిగి అక్కడి నుంచి వస్తూ 80 గ్రాముల హషిష్‌ అనే డ్రగ్స్ ‌ని తీసుకు వచ్చాడు. అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

News June 30, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు అధికారులపై కేసు

image

శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై కేసు నమోదయింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు శ్రీనివాసులు, పంకజ్ గౌతమ్, చక్రపాణిపై సీబీఐ కేసు నమోదుచేసింది. వీరి ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కాగా, విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించారని ముగ్గురిపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.

News June 30, 2024

HYD: చేజింగ్‌ చేసిన ఎస్‌టిఎఫ్‌.. డ్రగ్స్ స్వాధీనం

image

ఉత్తరఖాండ్‌ నుంచి సిటీకి తీసుకు వస్తున్న లక్షన్నర విలువ గల హషిష్ అనే డ్రగ్స్‌ను సినిమా పక్కిలో చేజింగ్ చేసి ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ టీమ్‌ పట్టుకున్నారు. కీసర రాంపల్లికి చెందిన రిత్విక్‌.. ఉత్తరాఖాండ్‌ ‌కు వెళ్లి అక్కడ కొంత కాలం ఉన్నారు. తిరిగి అక్కడి నుంచి వస్తూ 80 గ్రాముల హషిష్‌ అనే డ్రగ్స్ ‌ని తీసుకు వచ్చాడు. అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

News June 30, 2024

సంగారెడ్డి: బాధ్యతలు స్వీకరించిన ఓడిఎఫ్ సీజీఎం

image

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం (ఓడిఎఫ్)చీఫ్ జనరల్ మేనేజర్ శివ శంకర ప్రసాద్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగుల సహకారంతో ఆయుధ కర్మాగారం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.