Telangana

News June 30, 2024

నిరుద్యోగులపై కాంగ్రెస్‌ పార్టీది కపట ప్రేమ: హరీశ్‌ రావు

image

ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్‌.. గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నుతున్నారని MLA హరీశ్‌ రావు విమర్శించారు. రాహుల్‌ గాంధీని అశోక్‌నగర్‌కు పిలిపించి మరీ హామీ ఇప్పించారని, 2లక్షల ఉద్యోగాలు నింపుతామని రాహుల్‌ మాట ఇచ్చారని గుర్తుచేశారు. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని నిలదీశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు APలో 1:100 పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు.

News June 30, 2024

వేములవాడ: మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులే: డీఎస్పీ

image

మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులేనని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆదివారం తెలిపారు.
నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన, సగం నెంబర్ ప్లేట్ కలిగి ఉన్న వాహనదారులపై క్రిమినల్ కేసులే తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్పెషల్ డ్రైవ్‌లో 1223 కేసులు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

News June 30, 2024

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్‌ (20) శనివారం అమెరికాలో మృతి చెందాడు. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్‌ అమెరికాలో మిస్సోరీ స్టేట్‌లో ఉన్న శ్యాండిల్‌ ఎస్‌ టౌన్‌లో ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు. గతేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లిన కిరణ్‌ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో మునిగి చనిపోయాడు.

News June 30, 2024

మూసీ ప్రాజెక్ట్ నీళ్ల కోసం రైతుల ఎదురుచూపులు

image

నల్గొండ జిల్లాలోని రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ మూసీ. కాగా ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 637 అడుగుల నీరు ఉంది. మూసి ప్రాజెక్ట్ కాల్వల ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని NKL, NLG, MLG, SRPT నియోజకవర్గంలోని 40 వేల పైచిలుకు భూమి సాగు అవుతుంది. మూసీ నీటి విడుదలపై ప్రాజెక్ట్ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో మూసి నీళ్లు వస్తాయా…? రావా…? అని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు.

News June 30, 2024

మేడారంలో భక్తుల సందడి

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగు వద్ద పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్దకు చేరుకొని తల్లులకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం ( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

News June 30, 2024

MBNR: ఆర్టీసీ సేవలకు విశేష స్పందన !

image

ఉమ్మడి జిల్లా ఆర్టీసీ కార్గోలో వినూత్న సేవలు చేపట్టారు. సమ్మక్క, సారక్క జాతరను పురస్కరించుకొని భక్తులకు మేడారం ప్రసాదాన్ని అందించారు. మూడేళ్ల నుంచి శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఇంటివద్దకే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు అనే కార్యక్రమాలు చేపట్టగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,708 బుకింగ్ చేసుకున్న మందికి ఇంటివద్దకే ప్రసాదాన్ని అందజేశారు.

News June 30, 2024

రాజన్న గోశాలలో 5 కోడెల మృత్యువాత

image

వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో 5 కోడెలు శనివారం మృతి చెందాయి. మహాలక్ష్మి ప్రాంతంలోని మూలవాగులో గోశాల సిబ్బంది కోడెలను ట్రాక్టర్‌లో తరలించి పూడ్చి వేశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న కోడెలు మృతి చెందినట్లు తెలుస్తోంది.

News June 30, 2024

ఉమ్మడి జిల్లాలో వర్షపాతం వివరాలు

image

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 44.8 మి.మీ, నారాయణపేట జిల్లా మరికల్లో 31.5 మి.మీ, వనపర్తి జిల్లా ఘన్పూర్ లో 25.8 మి.మీ, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 30, 2024

పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పై నుండి పడి బాలుడు మృతి

image

పొలం దున్నుతుండగా డ్రైవర్ పక్కన కూర్చున్న ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఘటన రామన్నపేట మండలం మునిపంపులలో జరిగింది. గ్రామానికి చెందిన వనం గణేష్ (7) అనే బాలుడు తన బాబాయ్ ట్రాక్టర్‌‌తో పొలం దున్నుతుండగా తన బాబాయ్ పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద జారి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News June 30, 2024

KMM: ఊరూ వాడా వన మహోత్సవం…..

image

తెలంగాణలో హరితహారం గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు తొమ్మిది విడతలుగా మొక్కలు నాటించింది. ప్రస్తుత ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట ఈకార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఐతే పచ్చదనం పెంపుదలకు 1950లో కాంగ్రెస్ సర్కారు ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తికానున్న నేపథ్యంలో ‘వజ్రోత్సవ వన మహోత్సవం’గా నామకరణం చేశారు.