India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట, మానకొండూర్ మండలాల్లో 41.4°C నమోదు కాగా, ఇల్లందకుంట, గన్నేరువరం 41.2, తిమ్మాపూర్ 41.1, కరీంనగర్ రూరల్ 41.0, చిగురుమామిడి 40.9, కరీంనగర్ 40.4, గంగాధర, వీణవంక, కొత్తపల్లి 40.3, రామడుగు 39.9, శంకరపట్నం 39.8, సైదాపూర్ 39.7, హుజూరాబాద్ 39.5, చొప్పదండి 38.4°C గా నమోదైంది.
సళేశ్వరం లింగమయ్య జాతర నేటి నుంచి 13 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాకపోకలు, మెడికల్ సదుపాయాలు, శుద్ధి చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తూ, గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు శరీరాన్ని ఒత్తిడికి గురిచేయకుండా విశ్రాంతిగా యాత్ర చేయాలని సూచిస్తున్నారు. అధిక రద్దీ సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మే 14న హైదరాబాద్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్ పర్యటనలో భాగంగా కాళోజీ కళాక్షేత్రం సందర్శించనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. చరిత్ర గల వరంగల్‌ను ప్రపంచ దేశాల సుందరీమణులు సందర్శించేందుకు దక్కిన అరుదైన గౌరవం అని తెలిపారు.
గంటల వ్యవధిలో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. రామన్నపేట మండలం నిదానపల్లిలో జింకల అంజి, కావ్య డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కావ్య గురువారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న అంజి పురుగు మందు తాగి చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతూ సంధ్య అనే గర్భిణి మృతి చెందినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సంధ్య తీవ్ర రక్తస్రావంతో అక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం నగరంలోని మాతాశిశు ఆసుపత్రికి వచ్చింది. కాగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందినట్లు మృతురాలి భర్త జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్‌కు చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఇదే మండలానికి చెందిన టప్ప భాను అనే నిందితుడికి గురువారం జిల్లా న్యాయమూర్తి అబ్దుల్ రఫీ 26 ఏళ్ల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. 2024 మార్చి 17న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం కోర్టు తీర్పు వెల్లడించిందని చెప్పారు.
కరీంనగర్ జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించుటకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు క్రీడా శాఖ తెలిపారు. జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలను జిల్లా వ్యాప్తంగా 10 గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20వ తేదీ లోపు అంబేద్కర్ స్టేడియంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బోడుప్పల్‌లో జిమ్ ట్రైనర్ మర్డర్ వెనుక విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఇందిరానగర్‌కు చెందిన చంటి భార్యతో జిమ్ ట్రెయినర్ సాయికిషోర్ చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. దీంతో పుట్టింటికి వెళ్లింది. కక్షగట్టిన చంటి మర్డర్‌కు ప్లాన్ చేసి స్నేహితులు ధ్రువకుమార్‌సింగ్, శ్రీకాంత్, సాయికిరణ్‌తో కలిసి జిమ్‌లోనే అతడిపై డంబెల్‌తో దాడిచేయగా మృతిచెందాడు. రాత్రి నిందితులను రిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.