Telangana

News June 30, 2024

చేగుంట ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

image

చేగుంట రోడ్డు ప్రమాదంలో <<13531104>>మృతుల సంఖ్య ఆరు<<>>కు చేరింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మృతి తీరని విషాదం నింపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చిక్యా రాజేశ్, రాజు, మహేశ్ సోదరులు మేకల వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో రాజు స్పాట్‌లోనే చనిపోగా.. నిన్న రాజేశ్ చనిపోయాడు. మహేశ్ చికిత్స పొందుతున్నాడు. స్వస్థలం నుంచి వచ్చిన వారి బంధువులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.

News June 30, 2024

‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌ది మన నాగర్‌కర్నూలే!

image

‘కల్కి 2898 AD’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్‌పై అందరి దృష్టి పడింది. NGKL జిల్లా తాడూరు మండలం ఐతోలుకు చెందిన డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి, జయంతిరెడ్డి దంపతుల కొడుకే నాగ్ అశ్విన్. వృత్తి కోసం వీరు HYD వెళ్లినా గ్రామంలో సొంతిల్లు ఉంది. కుటుంబ, ఇతర శుభకార్యాలకు అందరూ ఐతోలుకు వచ్చి వెళ్తుంటారు. తాజాగా ‘కల్కి’తో నాగ్ స్వగ్రామంలో సందడి నెలకొంది.

News June 30, 2024

HNK: ఇన్‌స్టాగ్రాం పరిచయం.. బాలికపై అత్యాచారం

image

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకొని బాలికను ఓ యువకుడు అత్యాచారం చేశాడు. HNK జిల్లా కమలాపూర్ మండలంలో తాతయ్య ఇంటి వద్ద ఉంటున్న ఓ బాలిక (15)తో కామారెడ్డికి చెందిన శంకర్ (23) ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మిన ఆ బాలిక ఈనెల 23న ఇంట్లో నుంచి వెళ్లింది.అయితే శంకర్ తనను నమ్మించి అత్యాచారం చేశాడని బాలిక తన మేనమామకు చెప్పడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.

News June 30, 2024

NLG: ధరణి దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం!

image

NLGజిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ధరణి సమస్యలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ తీసుకుని 13 రోజుల వ్యవధిలోనే 2,120 దరఖాస్తులు పరిష్కరించింది. పెండింగ్లో 21,693 దరఖాస్తులు ఉన్నాయి. ఇందులో తహసిల్దార్ల పరిధిలో 11,155, ఆర్డీవోల పరిధిలో 6,122 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.

News June 30, 2024

HYD: రూ.10 కోసం గొడవ.. ఆటో డ్రైవర్ మృతి..!

image

HYD నగరంలో రూ.10 కోసం జరిగిన గొడవలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అన్వర్ (37) ఆటోలో.. ఓ బాలుడు (16) ప్రయాణించాడు. ఆటోడ్రైవర్ ఛార్జీ రూ.20 అడగగా, బాలుడు రూ.10 మాత్రమే ఇచ్చాడు. మిగతా పైసలు ఇవ్వడానికి నిరాకరించిన బాలుడు డ్రైవర్‌ను నెట్టేశాడు. కిందపడిన డ్రైవర్ తలకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 30, 2024

HYD: రూ.10 కోసం గొడవ.. ఆటో డ్రైవర్ మృతి..!

image

HYD నగరంలో రూ.10 కోసం జరిగిన గొడవలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అన్వర్ (37) ఆటోలో.. ఓ బాలుడు (16) ప్రయాణించాడు. ఆటోడ్రైవర్ ఛార్జీ రూ.20 అడగగా, బాలుడు రూ.10 మాత్రమే ఇచ్చాడు. మిగతా పైసలు ఇవ్వడానికి నిరాకరించిన బాలుడు డ్రైవర్‌ను నెట్టేశాడు. కిందపడిన డ్రైవర్ తలకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 30, 2024

KNR: ఇన్‌స్టాగ్రాం పరిచయం.. బాలికపై అత్యాచారం

image

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకొని బాలికను ఓ యువకుడు అత్యాచారం చేశాడు. కమలాపూర్ మండలంలో తాతయ్య ఇంటి వద్ద ఉంటున్న ఓ బాలిక (15)తో కామారెడ్డికి చెందిన శంకర్ (23) ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మిన ఆ బాలిక ఈనెల 23న ఇంట్లో నుంచి వెళ్లింది. అయితే శంకర్ తనను నమ్మించి అత్యాచారం చేశాడని బాలిక తన మేనమామకు చెప్పడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.

News June 30, 2024

T-20 ఛాంపియన్ ఇండియా.. MDCA హర్షం

image

ఇండియా టీం పొట్టి క్రికెట్ ఛాంపియన్(T-20)గా నిలవడం చాలా సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (MDCA) ప్రధాన కార్యదర్శి M. రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా Way2Newsతో ఆయన మాట్లాడుతూ..17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని, యువతలో క్రికెట్ క్రేజ్ మరింత పెరిగిందని, ఉమ్మడి జిల్లా యువత చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు.

News June 30, 2024

రేపటి నుంచే కొత్త చట్టాలు

image

రేపటి నుంచి నూతన చట్టాలు అమలులోకి రానున్నాయి. ఈ చట్టాల ద్వారా సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, బెదిరింపులు, చోరీ కేసుల్లో కఠిన శిక్షలు అమలవుతాయి. జడ్జిలు కేసులను రెండు వాయిదాలకు మించి ఎక్కువ రోజులు పొడిగించడానికి వీలుండదు. పోలీస్ శాఖకు పూర్తి అధికారాలు ఉండడంతో కేసు త్వరగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News June 30, 2024

MBNR: ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు

image

MBNR: రెగ్యులర్, ఇంటర్మీడియట్ కళాశాలలో అడ్మిషన్ల గడువు ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జూలై 31వ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈ నెల 30న మొదటి దశ అడ్మిషన్ల ముగింపు ఉండగా, బోర్డు ఆదేశాల మేరకు జూలై 1 నుంచి రెండోదశ అడ్మిషన్లు ప్రారంభమై జూలై 31 వరకు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.