Telangana

News June 30, 2024

తొర్రూరు: భార్య మందుల కోసం వచ్చి మృత్యువాత

image

భార్య మందుల కోసం వచ్చి ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాలకు చెందిన నంగునూరు నాగన్న (62) భార్య మందుల కోసం తొర్రూరుకు వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్సులో వరంగల్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

News June 30, 2024

సంగారెడ్డి: కుటుంబ కలహాలతో వివాహిత సూసైడ్

image

కుటుంబ కలహాలతో వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన గుమ్మడిదల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కొత్తపల్లికి చెందిన పోచయ్యకు నర్సాపూర్ మండలం నారాయణపూర్‌కు చెందిన మౌనిక(26)తో 8ఏళ్ల క్రితం పెళ్లైంది. శనివారం ఉదయం దంపతులు గొడవ పడ్డారు. అనంతరం భర్త పనికి వెళ్లగా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను బయటకు పంపి మౌనిక తలుపులు వేసుకుంది. పిల్లల ఏడ్పులతో స్థానికులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఉరేసుకుంది.

News June 30, 2024

రెండున్నర గంటలు ఆలస్యంగా పరీక్ష

image

వసతిగృహ సంక్షేమాధికారుల ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పరీక్ష ఖమ్మం జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో శనివారం రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఖమ్మంలో ఉన్న ప్రియదర్శిని యంత్రవిద్య మహిళా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 80 మంది అభ్యర్థులకు సాయంత్రం 5గంటలకు ప్రారంభమైంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆలస్యమైనట్లు నోడల్‌ అధికారి శ్రీరాం తెలిపారు.

News June 30, 2024

జులై 8 నుంచి జిల్లా కేంద్రంలో ప్రజావాణి యథాతథం

image

నల్గొండ జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి జులై 8 నుంచి ప్రతి సోమవారం యథాతథంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకునే ఫిర్యాదుదారులు మొదట సంబంధిత మండలాల్లో ఫిర్యాదులు సమర్పించాలన్నారు. అక్కడ 15 రోజులైనా పరిష్కారం కానీ వారు జిల్లా స్థాయికి రావాలన్నారు.

News June 30, 2024

రామగిరి: కానిస్టేబుల్ సస్పెన్షన్

image

పోలీసు ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన రామగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే సదానందంను సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినా, విధులలో నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.

News June 30, 2024

PUకు రూ.100 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్

image

PU ఏర్పడి 16ఏళ్లు గడుస్తున్నా కనీసం వసతులు కరవయ్యాయి. ఎక్కడ చూసినా సమస్యలు కనిపించేవి. పీయూ లైబ్రరీలో సైతం అరకొర పుస్తకాలే ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఉష స్కీమ్ ద్వారా ఈ ఏడాది రూ. 100 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో నిధులు విడుదల చేస్తూ వివిధ విభాగాల్లో వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

News June 30, 2024

హైదరాబాద్: టీమిండియాకు అభినందనలు తెలిపిన KTR

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. T20 ప్రపంచ కప్‌ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ గొప్పగా అనిపించింది అన్నారు. బౌలర్స్ అందరూ అద్భుతంగా బౌలింగ్ చేసి అదరగొట్టారు మరియు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీ చేసి వందల కోట్ల మంది హృదయాలను సంతోషపెట్టారని X లో రాసుకొచ్చారు.

News June 30, 2024

ఆదిలాబాద్: రాథోడ్ రమేశ్ ప్రస్థానం

image

ఆదిలాబాద్ మాజీ MP రమేశ్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కి చెందిన రమేశ్ OCT 20 1966లో జన్మించారు. రాజకీయ ప్రస్థానం TDP తరఫున 1995లో జడ్పీటీసీగా ప్రారంభమైంది. పలు పదవుల్లో బాధ్యతలు స్వీకరించి ఎనలేని సేవలను అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తనదైన శైలిలో రాజకీయ ముద్ర వేసుకున్నారు. కాగా, నిన్న అస్వస్థతకు గురై మృతి చెందాడు.

News June 30, 2024

కామారెడ్డి: కన్నకొడుకును కడతేర్చిన తండ్రి

image

మద్యం మత్తులో తండ్రి కొడుకుని కడతేర్చిన ఘటన కామారెడ్డి(D) ఎల్లారెడ్డి(M)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గండి మాసానిపేట్‌కు చెందిన వెంకటేశంకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సాయిలు(40) మద్యానికి బానిసై ఆస్తి కోసం తండ్రితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో విసుగు చెందిన వెంకటేశం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిలు‌ను కర్రతో బాది చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి సమీపంలోని కాలువలో పడేసినట్లు తెలిపారు.

News June 30, 2024

MBNR: విధుల్లోకి 285 మంది అతిథి అధ్యాపకులు

image

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది విధులు నిర్వహించిన 285 మంది అతిథి అధ్యాపకులు విధుల్లో చేరారు. దీంతో 28న గతేడాది పని చేసిన అతిథి అధ్యాపకులను కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్మడి జిల్లా లోని 59 జూనియర్ కళాశాలల్లో 285 మందిని జులై 31 వరకు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.