Telangana

News June 30, 2024

మన పాలమూరు వాసి SBI ఛైర్మన్ !

image

SBI కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టిని FSIB సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం SBI ఎండీగా ఉన్న ఆయన గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. ఆయన ఇంటర్ వరకు ఆలంపూర్, గద్వాలలో చదివారు. రాజేంద్రనగర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన శెట్టి.. ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా 1988లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరడంతో గ్రేడ్. అయితే ఛైర్మన్ ఎన్నికపై కేంద్రానిదే తుది నిర్ణయం.

News June 30, 2024

ఆదిలాబాద్: డీఈడీ దరఖాస్తుకు నేడే LAST.. 10న పరీక్ష

image

DED కళాశాలలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం జున్ 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. ఆసక్తి గల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జులై 10న ఆన్లైన్‌ లో ఉంటుందని పేర్కొన్నారు. ఎడిట్ ఆప్షన్ నేటితో ముగుస్తుందని తెలిపారు. పూర్తి వివరాలకు htpp://deecet.cdse. telangana. gov.in ను సందర్శించాలని సూచించారు.

News June 30, 2024

నేడు నిజామాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ధర్మపురి శ్రీనివాస్ అంతక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతక్రియలకు సీఎంతో పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 30, 2024

కాజీపేట: రేపటి నుంచి సింగరేణి, పుష్ పుల్ రైళ్ల రద్దు

image

మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా వరంగల్-సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలును జులై 1 నుంచి 31 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే భద్రాచలం రోడ్-విజయవాడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు, కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్, సిర్పూర్ కాగజ్‌నగర్- కరీంనగర్ ప్యాసింజరు రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

News June 30, 2024

HYD: బ్రీత్ అనలైజర్‌ను ఎత్తుకెళ్లిన వాహనదారుడు

image

తనిఖీలు చేపడుతున్న పోలీసుల వద్ద నుంచి ఓ వాహనదారుడు బ్రీత్ అనలైజర్ ఎత్తుకెళ్లిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. బోయిన్పల్లి పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బ్రీత్ అనలైజర్ పట్టుకుని వేగంగా పారిపోయాడు. పోలీసులు విచారణ జరిపి నిందితుడి ఆచూకీ కోసం, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

News June 30, 2024

సిరిసిల్ల: వలకు చిక్కిన 20 కిలోల చేప

image

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు చెరువులో శనివారం మత్స్యకారులు చేపలు పట్టారు. ఈ క్రమంలో మత్స్యకారుల వలకు 20 కిలోల భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారులు చేపను చెరువు గట్టు పైకి తీసుకువచ్చారు. తమ గ్రామ చెరువులో భారీ చేప చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

News June 30, 2024

ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు: తుమ్మల

image

హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు రూ.655 కోట్లతో ఈ ఏడాది 6 రోడ్లు మంజూరు చేశామన్నారు. ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. గతంలో R&B మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారుల గురించి ప్రతిపాదన చేశానన్నారు. కొత్తగూడెం పాల్వంచ బైపాస్, మిస్సింగ్ లింక్ కలపడానికి 6km రోడ్డు రూ.125 కోట్లకు ఆమోదముద్ర పడిందన్నారు.

News June 30, 2024

HYD: బ్రీత్ అనలైజర్‌ను ఎత్తుకెళ్లిన వాహనదారుడు

image

తనిఖీలు చేపడుతున్న పోలీసుల వద్ద నుంచి ఓ వాహనదారుడు బ్రీత్ అనలైజర్ ఎత్తుకెళ్లిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. బోయిన్పల్లి పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బ్రీత్ అనలైజర్ పట్టుకుని వేగంగా పారిపోయాడు. పోలీసులు విచారణ జరిపి నిందితుడి ఆచూకీ కోసం, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

News June 30, 2024

యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్ నారాయణరెడ్డి

image

సోమవారం నుంచి నల్గొండ జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకొనే ఫిర్యాదుదారులు సంబంధిత మండలాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనే ఫిర్యాదులు సమర్పించాలని స్పష్టం చేశారు.