Telangana

News June 30, 2024

టీమిండియా గెలుపు.. అంబరాన్నంటిన సంబరాలు

image

టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. బిక్నూరులో అర్ధరాత్రి యువకులు ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించి స్థానిక సినిమా టాకీస్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేత బూని యువకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిట్లంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద క్రికెట్ అభిమానులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

News June 30, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రికెట్ అభిమానుల సంబరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రికెట్ అభిమానులు సంబరాలు నిర్వహించారు. T-20 వరల్డ్ కప్ ఫైనల్లో  దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడంతో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుతూ.. దేశాభిమానాన్ని చాటుకున్నారు. టపాసుల శబ్దాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా మారుమోగింది. 

News June 30, 2024

ధరణి పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ధరణి పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కస్తామని, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సీసీఎల్ఎ ఇన్‌ఛార్జి నవీన్ మిట్టల్‌కు తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ధరణి సమస్యలు, పరిష్కారాలపై రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిసిఎల్ఎ ఇంచార్జ్ నవీన్ మిట్టల్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

News June 30, 2024

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి:  జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశంపై వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. అదే విధంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News June 30, 2024

వైస్ ఛాన్సలర్ పోస్టుల్లో 50% బీసీలను నియమించాలి: ఆర్. కృష్ణయ్య

image

యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పోస్టుల నియామకాల్లో బీసీలకు 50శాతం పోస్టులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శనివారం కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్ టియూ, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీలలో పోస్టును బీసీలకు కేటాయించాలన్నారు.

News June 30, 2024

వైస్ ఛాన్సలర్ పోస్టుల్లో 50% బీసీలను నియమించాలి: ఆర్. కృష్ణయ్య

image

యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పోస్టుల నియామకాల్లో బీసీలకు 50శాతం పోస్టులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శనివారం కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్ టియూ, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీలలో పోస్టును బీసీలకు కేటాయించాలన్నారు.

News June 30, 2024

ADB: కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

image

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లు కలిశారు. ఢిల్లీలో శనివారం కేంద్రం రక్షణ శాఖ మంత్రిని కలిసి ఆదిలాబాద్‌‌లో ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్, సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం 2014లోనే ఆదిలాబాద్‌లో వైమానిక దళం స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను ప్రారంభించినట్లు వారు గుర్తు చేశారు.

News June 30, 2024

మెదక్: ఆపరేషన్ ముస్కాన్‌పై ఎస్పీ సమీక్ష

image

మెదక్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డా.బాలస్వామి తెలిపారు. శనివారం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహణ గురించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న పిల్లల్ని ఎవరైనా వెట్టిచాకిరి గురిచేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.

News June 30, 2024

పాలమూరులో 74,905 ఎకరాల్లో పంటల సాగు

image

ఈ వానాకాలంలో జున్ మొదటి వారంలోనే కురిసిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. సీజన్ ప్రారంభమై 24 రోజులు అయినా వానలు పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వానాకాలంలో 3,23,533 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో అక్కడక్కడా కురిసిన వర్గాలకు 40 శాతం మేర అంటే 74,905 ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు.

News June 30, 2024

కొండగట్టు: పవన్‌కు అంజన్న ప్రతిమను బహుకరించిన అభిమాని

image

కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు స్థానిక అభిమాని స్వామివారి ఇత్తడి విగ్రహం బహుకరించారు. స్థానిక కొబ్బరికాయల వ్యాపారి అయిన సుదగోని చిరంజీవి పవన్‌కళ్యాణ్‌కు అభిమాని. ఈ సందర్భంగా రూ.11 వేలు వెచ్చించి 9 కేజీల ఇత్తడితో అంజన్న ప్రతిమను తయారుచేయించి పవన్‌కు అందజేశారు. గతంలో కూడా కొండగట్టు వచ్చిన సందర్భంలో పీకేకి వివిధ వస్తువులు అందజేసినట్లు చేసినట్లు తెలిపారు.