Telangana

News June 29, 2024

ములకలపల్లిలో బైక్ సీటు కింద నుండి పాము

image

ములకలపల్లిలో బైక్ సీటు కిందకు పాము దూరింది. శనివారం సాయంత్రం మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. పని ముగించుకొని బైక్ వద్దకు వస్తుండగా సీటు కింది నుంచి మెల్లగా పాము బయటకు రావడం గమనించాడు. స్థానికులు వచ్చి దానిని వానకోయిల(విషరహితం)గా గుర్తించారు. తర్వాత పాము కిందకు దిగి రోడ్డు పక్కకు వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News June 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. @ పవన్ కళ్యాణ్ పర్యటనలో దొంగల చేతివాటం. @ జగిత్యాల జిల్లాలో చోరీకి పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్. @ మల్యాల మండలంలో ఉరివేసుకొని వృద్ధుడి ఆత్మహత్య. @ వేములవాడ మున్సిపాలిటీలో 101 రూపాయలకే అంతిమ సంస్కారాలు. @ హత్య కేసులో మెట్పల్లి మండల వాసికి జీవిత ఖైదు. @ కలెక్టరేట్ నైట్ వాచ్ మెన్ ను సన్మానించిన సిరిసిల్ల కలెక్టర్.

News June 29, 2024

ఆ పంచాయతీలు ఎప్పటికైనా భద్రాచలంలో కలపాల్సిందే: మంత్రి తుమ్మల

image

రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం నుంచి విడిపోయి ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రలో విలీనమైన 5 పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాల్సిందే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు , ఎటపాక, పురుషోత్తమ పట్నం, గుండాల పంచాయతీలు ముంపునకు గురి కావన్నారు. అయినా పోలవరం ముంపు పేరుతో ఆంధ్రాలో విలీనం చేశారని, ఆ పంచాయతీలను ఎప్పటికైనా భద్రాచలంలో కలపాల్సిందేనని స్పష్టం చేశారు.

News June 29, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 మంది పదవీ విరమణ

image

TGSRTC ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ వ్యాప్తంగా ఈరోజు 13 మంది పదవీ విరమణ పొందారు. కండక్టర్, డ్రైవర్, ADC, DCగా ఆర్టీసీకి సేవ చేసినందుకు రీజనల్ మేనేజర్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలని వారందరికీ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

News June 29, 2024

దుబ్బాక: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఆధ్యాపకులకు నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ భవాని తెలిపారు. డిగ్రీ కళాశాలలో కామర్స్-2, తెలుగు-1, కంప్యూటర్ సైన్స్-1 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని వివరించారు. జూలై 1 లోపు కళాశాలలో దరఖాస్తులు అందించాలని సూచించారు.

News June 29, 2024

చింతూరు నదిలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

image

చింతూరు మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని సీలేరు నదిలో శుక్రవారం సాయంత్రం ఓ బాలుడు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా శనివారం మృతదేహం లభ్యమైంది. గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చిన సింకు(7) శుక్రవారం సీలేరు నదికి తోటి పిల్లలతో కలిసి వెళ్లి గల్లంతయ్యాడు. మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News June 29, 2024

యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

image

వచ్చే సోమవారం నుంచి నల్గొండ జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకొనే ఫిర్యాదు దారులు సంబంధిత మండలాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనే ఫిర్యాదులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

News June 29, 2024

వికారాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు!

image

✏జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
✏VKBD:213 ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి: స్పీకర్
✏నాటు సారా విక్రయించిన, సరఫరా చేసిన కేసులు నమోదు:తాండూర్ ఎక్సైజ్ సీఐ
✏మల్లికార్జున్ ఖర్గేను కలిసిన తాండూర్ ఎమ్మెల్యే
✏మద్దూర్: చిరుత దాడితో లేగ దూడ మృతి
✏దోమ:కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే
✏VKBD:DS మృతి.. జిల్లా నేతల సంతాపం
✏జిల్లాలో పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

News June 29, 2024

వేములవాడ మున్సిపాలిటీలో రూ.101కు దహన సంస్కారాలు

image

వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలో మరణించిన వారి దహన సంస్కారాలను మూలవాగు ప్రాంతంలోని వైకుంఠధామంలో 101 రూపాయలకే నిర్వహించాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. వైకుంఠ రథం, కట్టెలు, డీజిల్, నీటిసరఫరాను రూ.101కే అందించనున్నట్లు తెలిపారు.

News June 29, 2024

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం: డా.మాలతి

image

వర్షాకాలం వ్యాధులు వ్యాపించే సమయం ఆసన్నమైందని , జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళికలు తయారుచేసి అమలు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.మాలతి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో రాఫిడ్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మందుల కొరత లేదని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.