Telangana

News June 29, 2024

మెదక్ సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి తనిఖీ

image

సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ మెదక్ సబ్ జైలునుతనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వంటశాల తనిఖీ చేసి ఆహార నాణ్యతపై జైలు పర్యవేక్షణ అధికారితో చర్చించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ముద్దాయిలకు వివిధ అంశాలపై లీగల్ ఏయిడ్ అపాయింట్మెంట్, జైల్ అదాలత్, ప్లీ బార్గెయినింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు. జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జైలు సిబ్బంది ఉన్నారు.

News June 29, 2024

తూప్రాన్: జ్యోతిబా పూలే విద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

తూప్రాన్ పట్టణ శివారుల పోతరాజుపల్లిలోని మహాత్మజ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం (వెల్దుర్తి)లో విద్యార్థి మల్లీశ్వరి (12) ఆత్మహత్యాయత్నం చేసింది. ఝరాసంఘం మండలం గిన్నాయపల్లికి చెందిన మల్లీశ్వరి ఈ ఏడాది ఏడో తరగతిలో చేరింది. సోమవారం విచ్చేసిన మల్లీశ్వరి ఇంటికి వెళ్తానంటూ మారాం చేసింది. అనంతరం విద్యాలయంలో దురద మందు తాగగా.. ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 29, 2024

భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటాం: మంత్రి తుమ్మల

image

జూలూరుపాడు, ఏన్కూర్ మండలంలో సీతారామ ప్రాజెక్టుకు వ్యవసాయ భూములను కోల్పోయిన రైతులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతు కుటుంబాల్లో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

News June 29, 2024

పాలమూరులో గర్జించిన నిరుద్యోగులు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు శనివారం మోతీలాల్ నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి వెంటనే గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలని, గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 చొప్పున తీసుకోవాలని ఫైరయ్యారు.

News June 29, 2024

ఖమ్మం లాడ్జిలో వ్యక్తి సూసైడ్ 

image

ఖమ్మంలోని మయూరి లాడ్జిలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మహబూబాబాద్‌ జిల్లా మర్రిపేటకు చెందిన ఎర్రసాని శ్రీనివాస్‌ రెడ్డి లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ రెడ్డి ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. సామాజిక కార్యకర్త అన్నం శ్రీనివాసరావు మృతదేహాన్ని ఖమ్మం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 29, 2024

నంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేస్తే కేసు: SP శరత్ చంద్ర పవార్ 

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారం రోజుల్లో నంబర్ ప్లేట్లు లేని 1,769 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ పాల్పడే నేరస్థులు నంబర్ ప్లేట్లు లేని వాహనాలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. నంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేస్తే వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామన్నారు.

News June 29, 2024

అమ్రాబాద్: టైగర్ సఫారీ టూర్ వాయిదా

image

అమ్రాబాద్ నల్లమల సందర్శనకు వచ్చే పర్యాటకులు జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు టైగర్ సఫారీ టూర్‌ను వాయిదా వేసుకోవాలని, వణ్యప్రాణుల సంతానోత్పత్తి దృష్ట్యా ఈ సమయంలో సఫారీ టూర్‌ను రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ 3నెలలు శ్రీశైలం- హైదరాబాద్ రహదారిపై వాహనాల వేగం 30కి మించరాదని, వన్యప్రాణుల స్వేచ్ఛకు ఎవరూ భంగం కల్గించరాదన్నారు. వన్యప్రాణులు ఉంటేనే పర్యావరణ, అటవీ సంపద, పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు.

News June 29, 2024

డి. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు: డిప్యూటీ సీఎం

image

ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి.శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురందుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.

News June 29, 2024

డి.శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు: డిప్యూటీ సీఎం

image

ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి.శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురందుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.

News June 29, 2024

HYD: ORR చేసింది కాంగ్రెస్.. RRR చేసేది కాంగ్రెస్!

image

HYD మహానగరాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు నాడు ఔటర్ రింగ్ రోడ్డు(ORR) అయినా.. నేడు రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అయినా చేసింది కాంగ్రెస్, చేసేది కాంగ్రెస్.. అని తెలంగాణ కాంగ్రెస్ X వేదికగా మ్యాప్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. RRR పనులను సెప్టెంబర్ నాటికి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని ఇటీవల రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే.