Telangana

News June 29, 2024

డీఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం

image

గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ధర్మపురి శ్రీనివాస్ పార్థివదేహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా డీఎస్ సేవలను డిప్యూటీ సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

News June 29, 2024

ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొట్లాట

image

ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ పాషా కొట్లాటకు దిగారు. పరస్పరం ఇరువురు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో ఛైర్మన్ వర్సెస్ వైస్ ఛైర్మన్ వర్గాలుగా కౌన్సిలర్లు విడిపోయారు. కాగా ఈ ఘటన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలోనే జరిగింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎమ్మెల్యే సముదాయించడంతో ఇరువురు శాంతించారు.

News June 29, 2024

హైదరాబాద్: 22 రోజుల్లో 1108 కేసులు నమోదు

image

గ్రేటర్ HYD పరిధిలో గత 22 రోజుల్లోనే 1108 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఎక్కువగా మద్యం సేవించి ప్రమాదాలకు కారకులైన వారు ఉన్నారని తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేశామన్నారు. కొందరి దగ్గర నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం, ధ్రువపత్రాలు, హెల్మెట్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్లో వెళ్లడం లాంటి కేసులు కూడా ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

News June 29, 2024

మోతిలాల్ నాయక్‌కు మద్దతుగా నల్గొండలో భారీ ర్యాలీ

image

OU లీడర్ మోతిలాల్ నాయక్ నిరుద్యోగుల సమస్యలపై నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నల్గొండ కేంద్ర గ్రంథాలయం నుంచి క్లాక్ టవర్ వరకు నిరుద్యోగులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 2, 3లలో పోస్టులు పెంచి పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించాలని నినాదాలు చేశారు. DSC పోస్టుల పెంపుతో పాటు పరీక్షకు టైం ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ తక్షణమే స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

News June 29, 2024

HYD: సాయి చంద్ చిత్రపటానికి కేటీఆర్, హరీశ్ నివాళి

image

HYD నగరం హస్తినాపురంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ‌వేద సాయిచంద్‌ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒక కుటుంబ మనిషిలా ఉండేవాడని హరీష్ రావు, తన ఆట, పాట మరువలేమని KTR అన్నారు.

News June 29, 2024

HYD: సాయి చంద్ చిత్రపటానికి కేటీఆర్, హరీశ్ నివాళి

image

HYD నగరం హస్తినాపురంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ‌వేద సాయిచంద్‌ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒక కుటుంబ మనిషిలా ఉండేవాడని హరీష్ రావు, తన ఆట, పాట మరువలేమని KTR అన్నారు.

News June 29, 2024

ఆదిలాబాద్ మాజీ MP రాథోడ్ రమేష్ ప్రస్థానం…

image

★నార్నూర్ మండలానికి చెందిన వ్యక్తి
★తొలిసారిగా TDP నుండి నార్నూర్ ZPTCగా ఎన్నికయ్యారు.
★ ఖానాపూర్ నుండి రెండుసార్లు MLAగా సేవాలందించారు.
★1999 – 2004 మద్యకాలంలో ఏపీ శాసనసభ సభ్యునిగా
★2006 నుండి 2009 వరకు ఆదిలాబాద్ ZP ఛైర్మన్‌గా ఉన్నారు.
★2009లో MPగా పనిచేసారు.
★కొన్ని నెలలో BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
★2021 లో BJP లో చేరారు.
★2023లో ఖానాపూర్ MLA గా పోటీచేసి ఓడిపోయారు.

News June 29, 2024

BREAKING: HYDలో మరో MURDER

image

HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నార్సింగిలో ఓ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఇంజినీర్ ఇజాయత్ అలీ దుబాయ్ నుంచి 20 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో ఈరోజు నిర్మానుష్య ప్రాంతంలో అతడిని గొంతుకోసి దుండగులు చంపేశారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన ఇద్దరు యువకులు, ఓ యువతి అతడిని చంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.

News June 29, 2024

BREAKING: HYDలో మరో MURDER

image

HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నార్సింగిలో ఓ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఇంజినీర్ ఇజాయత్ అలీ దుబాయ్ నుంచి 20 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో ఈరోజు నిర్మానుష్య ప్రాంతంలో అతడి గొంతుకోసి దుండగులు చంపేశారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన ఇద్దరు యువకులు, ఓ యువతి అతడిని చంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.

News June 29, 2024

ఉత్తమంగా నల్గొండ మహిళా కాలేజీ

image

నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు ఉమ్మడి జిల్లాలోని విద్యార్థినులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక మహిళా కాలేజీ కావడం, అత్యుత్తమ బోధన అందిస్తుండడంతో ఇక్కడ ఎక్కువగా అడ్మిషన్స్ జరుతున్నాయి. కాగా ఈ కాలేజీ 1972లో కేవలం 9 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. నేడు 3వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ కాలేజీకి గతేడాది న్యాక్ ఏ గ్రేడ్ లభించింది.