Telangana

News June 29, 2024

HYD: డీఎస్ పార్థివదేహానికి మంత్రి పొన్నం నివాళి

image

మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్‌ పార్థివదేహానికి ఈరోజు HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. బంజారాహిల్స్‌లోని వారి నివాసంలో నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ గొప్ప నాయకుడని కొనియాడారు. ఎంతో ప్రజా సేవ చేశారని తెలిపారు.

News June 29, 2024

మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్‌కు తీవ్ర అస్వస్థత

image

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత అర్ధరాత్రి ఉట్నూర్‌లోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎంఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎంపీ కోమాలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

News June 29, 2024

HYD: డీఎస్ పార్థివదేహానికి మంత్రి పొన్నం నివాళి

image

మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్‌ పార్థివదేహానికి ఈరోజు HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. బంజారాహిల్స్‌లోని వారి నివాసంలో నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ గొప్ప నాయకుడని కొనియాడారు. ఎంతో ప్రజా సేవ చేశారని తెలిపారు.

News June 29, 2024

HYD: ALERT.. పోస్ట్ ఆఫీస్ పేరుతో FAKE మెసేజ్‌లు

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లో ఉంటున్న ప్రజలకు అందులోనూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ పేరిట ఫేక్ మెసేజులు, కాల్స్, మెయిల్స్ వస్తున్నట్లుగా HYD తపాలా కార్యాలయ అధికారులు తెలియజేశారు. మీ పార్సల్ వేర్ హౌస్ వద్దకు వచ్చిందని, మీ కరెక్ట్ అడ్రస్ పంపాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో పంపొద్దని సూచించారు. నకిలీ లింకులపై క్లిక్ చేయొద్దని, సమస్యలపై sancharsaathi.gov.in/sfcలో ఫిర్యాదు చేయాలన్నారు.

ఆదిలాబాద్: ఇక పరిషత్‌లలో ప్రత్యేక పాలన..?

image

గ్రామ పంచాయతీల మాదిరిగానే జిల్లా, మండల ప్రజా పరిషత్‌లూ త్వరలోనే ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. జులై 4, 5 తేదీల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. దీంతో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్‌లోనూ ప్రత్యేకాధికారుల పాలనే అమలులోకి వచ్చే అవకాశం కన్పిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ కసరత్తు చేస్తున్నారు.

News June 29, 2024

డి.శ్రీనివాస్‌కు ప్రముఖుల నివాళి

image

కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. డీఎస్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మంత్రులు పొన్నం, కొమటిరెడ్డి, బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళి అర్పించారు.

News June 29, 2024

HYD: పోలీసుల చొరవ.. 8 నిమిషాల్లో రూ.18 లక్షలు సేఫ్

image

HYD అంబర్‌పేట్‌లో నివసించే ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఫెడెక్స్‌ కొరియర్‌ ప్రతినిధినంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘నీ ఆధార్ నంబర్‌తో ముంబై నుంచి ఇరాన్‌కు మాదకద్రవ్యాలతో పార్సిల్‌ వచ్చింది.. దీనిపై కేసు నమోదైంది’ అని బెదిరించాడు. కేసు నకిలీ పత్రాలను చూపించాడు. బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలనడంతో రూ.18 లక్షలు ఇచ్చాడు. వెంటనే బాధితుడు తేరుకుని పోలీసులకు కాల్ చేయగా 8 నిమిషాల్లోనే నగదు బదిలీని ఆపేశారు.

HYD: కస్టమర్ వెళ్లిపోయాక ఏటీఎంలో నుంచి వచ్చిన డబ్బు

image

ఏటీంఎలో డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా ఆలస్యం అవడం.. డబ్బు నిల్వ లేదనుకుని ఖాతాదారు వెళ్లి పోయిన తర్వాత నగదు ప్రత్యక్షమైన ఘటన HYD పాతబస్తీ హాషామాబాద్‌లో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట బండ్లగూడ రోడ్డులోని హాషామాబాద్‌ టవర్‌గల్లీ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.20 వేలు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ డబ్బును ఏఎస్సై తీసుకొని బ్యాంకు అధికారులు సమాచారం ఇవ్వగా కస్టమర్‌కు ఇస్తామన్నారు.