Telangana

News June 29, 2024

HYD: కస్టమర్ వెళ్లిపోయాక ఏటీఎంలో నుంచి వచ్చిన డబ్బు

image

ఏటీంఎలో డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా ఆలస్యం అవడం.. డబ్బు నిల్వ లేదనుకుని ఖాతాదారు వెళ్లి పోయిన తర్వాత నగదు ప్రత్యక్షమైన ఘటన HYD పాతబస్తీ హాషామాబాద్‌లో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట బండ్లగూడ రోడ్డులోని హాషామాబాద్‌ టవర్‌గల్లీ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.20 వేలు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ డబ్బును ఏఎస్సై తీసుకొని బ్యాంకు అధికారులు సమాచారం ఇవ్వగా కస్టమర్‌కు ఇస్తామన్నారు.

News June 29, 2024

కేసముద్రం: రూ.30.38 కోట్ల బియ్యం మాయం!

image

కేసముద్రం మండల పరిధిలోని రైస్ మిల్లుల్లో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ తనిఖీల్లో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. CMR కింద ధాన్యాన్ని మర పట్టించి ప్రభుత్వానికి అందించాల్సిన రు.30.38 కోట్ల విలువ చేసే బియ్యాన్ని మిల్లర్లు మాయం చేసినట్లు అధికారులు తేల్చారు. ఆయా మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డీఎం కృష్ణవేణి తెలిపారు.

News June 29, 2024

రేపు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

image

నేడు మరణించిన పీసీసీ మాజీ అధ్య‌క్షుడు డి.శ్రీ‌నివాస్ (డీఎస్‌) పార్ధీవదేహానికి రేపు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వహించనున్నారు. ఈ మేరకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించారు. ఈ మేరకు రేపు డీఎస్ స్వస్థలం నిజామాబాద్ లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

News June 29, 2024

ఆదిలాబాద్: SGT సీనియారిటీ జాబితా విడుదల

image

ఆదిలాబాద్ SGT సీనియారిటీ జాబితా విడుదలైంది. ఈ మేరకు DEO అన్ని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు SGTలు & తత్సమాన కేడర్ల బదిలీల కోసం సీనియారిటీ జాబితా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సందేశాలు పంపారు. ఇందులో ఖాళీల జాబితా కూడా ప్రదర్శించామని పేర్కొన్నారు. MEOలు ఉపాధ్యాయులు ఖాళీలను ధ్రువీకరించాలని, బదిలీలో, జాబితాలో ఏమైనా సవరణలు ఉంటే శనివారం మధ్యాహ్నం 1లోగా దరఖాస్తులు చేసుకోవాలని అభ్యర్థించారు.

News June 29, 2024

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్లగా విస్తరణ: మంత్రి

image

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు త్వరలో టెండర్లు ఆహ్వానించేలా కసరత్తు చేయాలని, సెప్టెంబర్‌లో ఈ మేరకు పనులు ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారులపై హైటెక్ సిటీలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆయన మాట్లాడారు. ఇప్పటికే HYD-విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో జాప్యం చోటుచేసుకుందన్నారు.

KMM: ‘సాగుబడి.. ఇక ఇదే ఒరవడి’

image

ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తృతపరచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఓ రైతు వేదికలో మాత్రమే అవగాహన కార్యక్రమాలు జరిగేవి. ఐతే ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో 16, భద్రాద్రి జిల్లాలో 13 కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు క్లస్టర్ల వారీగా రైతు వేదికలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

News June 29, 2024

డీఎస్ మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

image

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని తెలిపారు.

News June 29, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి సవాల్..!

image

BRS మహిళా నేత, మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎంకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మహేశ్వరం ప్రాంతానికి రద్దు చేసిన రూ.250 కోట్లను తిరిగి మంజూరు చేయాలన్నారు. గత సర్కారు మంజూరు చేసిన పనులను రద్దు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.