Telangana

News June 29, 2024

డి. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు: భట్టి

image

మధిర: ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి. శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురంధరుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని భట్టి పేర్కొన్నారు.

News June 29, 2024

నల్గొండ జిల్లాలో పడిపోతున్న బీఆర్‌ఎస్..!

image

బీఆర్‌ఎస్ బలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతకంతకూ పడిపోతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన సర్పంచ్, MPTC, ZPTCఎన్నికల్లో అత్యధికం BRS కైవసం చేసుకుంది. పురపాలిక ఎన్నికల్లోనూ 19 పురపాలికల్లో అన్నింట్లోనూ ఆ పార్టీకి చెందిన వారే ఛైర్మన్‌లుగా గెలిచారు. 3 ZPలను సైతం కైవసం చేసుకుంది. ప్రస్తుతం కేవలం SRPT, NKL, పోచంపల్లి, చండూరులో మాత్రమే BRS‌కుచెందిన వారు ఛైర్మన్‌లుగా ఉండగా..మిగతా చోట్లా కాంగ్రెస్‌ వారు ఉన్నారు.

News June 29, 2024

BREAKING: నాగర్ కర్నూల్: డివైడర్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 29, 2024

త్వరలో మరో రెండు పంప్ హౌస్‌లు ట్రయల్ రన్ : కలెక్టర్

image

అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను కలెక్టర్‌ జితేశ్‌ శుక్రవారం సందర్శించారు. ఆయనకు జలవనరులశాఖ అధికారులు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. పూసుగూడెం, కమలాపురం వద్దనున్న పంప్‌హౌస్‌లు ట్రయల్‌ రన్‌కు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని 104 కిలోమీటర్ల సీతారామ ప్రధాన కాల్వ ద్వారా జలాలను వదిలేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు.

News June 29, 2024

అల్లాదుర్గం: విద్యార్థులే.. పాఠశాల స్వీపర్లు

image

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లుగా మారి పాఠశాల శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీ సిబ్బంది పాఠశాలలను శుభ్రం చేయాలని ఆదేశాలున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులు స్వీపర్లుగా పనిచేస్తున్నారు. బాల కార్మికులతో పనులు చేయించవద్దని ఆదేశాలు ఉన్నా.. ఫలితంగా విద్యార్థులే శుభ్రం చేస్తున్నారు

News June 29, 2024

వరంగల్: 1న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

image

హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జూలై 1న వరంగల్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు మూగల కుమార్ యాదవ్, ఊర యుగేందర్ రెడ్డి తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జులై 7న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

News June 29, 2024

ఆదిలాబాద్: జులై 8 వరకు రీవెరిఫికేషన్

image

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు 91.18 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మే నెలలో జరిగిన పరీక్షలకు 737 మంది విద్యార్థులు హాజరుకాగా 672 మంది పాసయ్యారు. ఇందులో 398 మంది బాలురు, 274 మంది బాలికలు ఉన్నట్లు డీఈవో ప్రణీత తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం జులై 8 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

News June 29, 2024

రేపు నిజామాబాద్‌లో డీఎస్ అంత్యక్రియలు

image

పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నేటి మధ్యాహ్ననికి హైదరాబాద్ చేరుకోనున్నారు. డీఎస్ పార్ధివ దేహాన్ని హైదరాబాద్‌లోని స్వగృహం నుంచి మధ్యాహ్నం 2 గంటల తరువాత ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ తరలిస్తారు. రేపు మధ్యాహ్నం డీఎస్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.

News June 29, 2024

BRSలో చేరి మళ్లీ కాంగ్రెస్‌లోకి..

image

డి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో ఒక దశలో ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే అందరు భావించారు. రాజకీయ పరిస్థితుల వల్ల అది కుదరలేదు. కాగా రాష్ట్ర విభజన తర్వాత 2015లో బిఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్ఎస్‌లో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో స్తబ్దుగా ఉండిపోయారు. అనంతరం ఇటీవల కాలంలో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

News June 29, 2024

HYD: దారుణం.. ప్రేమకు అడ్డొస్తున్నాడని చంపేశారు..!

image

ప్రేమకు అడ్డొస్తున్నాడని ఫ్రెండ్‌ను దారుణంగా చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD కూకట్‌పల్లి అల్లాపూర్‌లోని సఫ్దర్‌నగర్ వాసి డానీష్(17) యూసుఫ్‌గూడలో ఇంటర్ చదువుతున్నాడు. తనతోపాటు చదివే ఓ అమ్మాయితో డానీష్ చనువుగా ఉన్నాడు. ఆ అమ్మాయినే ప్రేమిస్తున్న ఓ రౌడీ షీటర్ కుమారుడు కోపంతో బోరబండలో తన ఫ్రెండ్స్‌తో కలిసి డానీష్‌ను బీరు సీసాలతో కొట్టి చంపేశాడు. 10 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు.