Telangana

News April 11, 2025

HYD: జిమ్ ట్రైనర్ హత్య.. నిందితుల రిమాండ్

image

బోడుప్పల్‌లో జిమ్ ట్రైనర్‌ మర్డర్‌ కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఇందిరానగర్‌కు చెందిన చంటి భార్యతో జిమ్ ట్రెయినర్ సాయికిషోర్‌ చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. దీంతో పుట్టింటికి వెళ్లింది. కక్షగట్టిన చంటి మర్డర్‌కు ప్లాన్ చేసి స్నేహితులు ధ్రువకుమార్‌సింగ్, శ్రీకాంత్, సాయికిరణ్‌‌తో కలిసి జిమ్‌లోనే అతడిపై డంబెల్‌తో దాడిచేయగా మృతిచెందాడు. రాత్రి నిందితులను రిమాండ్ చేశారు.

News April 11, 2025

పట్టుబడిన వాహనాలను తీసుకెళ్లండి: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించాలని నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందజేస్తామని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

News April 11, 2025

గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి తగుసూచనలు, సలహాలు, వైద్యసాయం అందించాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్య ఆరోగ్యశాఖ వైద్యులు, సిబ్బందికి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణీలకు సేవలు మెరుగుపరచాలని, వారి ఆరోగ్యంపై ANMలో ఆశా వర్కర్లు, ఫాలోఅప్ చేయాలన్నారు.

News April 11, 2025

సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

image

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.

News April 11, 2025

శంకరపట్నం: రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మహిళ మృతి

image

శంకరపట్నం(M) తాడికల్ గ్రామశివారులో KNR-WGL ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సైదాపూర్ మండలం గర్రెపల్లికి చెందిన కౌడగాని కిషన్ రావు, భార్య శోభ, కూతురు అశ్విని బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శోభ చికిత్స పొందుతూ మృతి చెందింది. శోభ తమ్ముడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు SI రవి తెలిపారు.

News April 11, 2025

NZB: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

image

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి <<16019748>>కిడ్నాపైన <<>>బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్‌లోని మీర్జాపూర్‌కు చెందిన గైక్వాడ్ బాలాజీ చిన్నారి రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్‌లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ACP వివరించారు. ఆయనతో పాటు SHO రఘుపతి ఉన్నారు.

News April 11, 2025

ఖమ్మం జిల్లా అప్‌డేట్స్

image

∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం ∆} ముదిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మంలో పవర్ కట్ ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 11, 2025

నల్గొండ: పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

image

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన గుర్రంపోడు మండలం అములూరులో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా.. మేకల చిన్న రాములు (60) రోజు మాదిరిగానే గొర్రెలను మేపడానికి పొలానికి వెళ్లాడు. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోండగా చెట్టు కింద తలదాచుకున్నాడు. ఈ క్రమంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 11, 2025

కరీంనగర్: ప్రవేశాల గడువు పెంపు

image

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాల ప్రవేశాల దరఖాస్తు నెల 30 వరకు పొడిగించారు. అర్హత గల విద్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి డి. పవన్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యలయంలో, 0878 2957085 ఫోన్‌లో సంప్రదించాలన్నారు. 

News April 11, 2025

జడ్చర్ల: గెస్ట్ లెక్చరర్ల పోస్టుల కోసం దరఖాస్తులు 

image

జడ్చర్ల మండలం మాచారం తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ, పీజీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కెమిస్ట్రీ- 4, ఫిజిక్స్ 1, హిస్టరీ 1, కామర్స్ 1, తెలుగు 1, ఇంగ్లీష్ లో ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు.

error: Content is protected !!