Telangana

News June 29, 2024

HYD: దారుణం.. ప్రేమకు అడ్డొస్తున్నాడని చంపేశారు..!

image

ప్రేమకు అడ్డొస్తున్నాడని ఫ్రెండ్‌ను దారుణంగా చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD కూకట్‌పల్లి అల్లాపూర్‌లోని సఫ్దర్‌నగర్ వాసి డానీష్(17) యూసుఫ్‌గూడలో ఇంటర్ చదువుతున్నాడు. తనతోపాటు చదివే ఓ అమ్మాయితో డానీష్ చనువుగా ఉన్నాడు. ఆ అమ్మాయినే ప్రేమిస్తున్న ఓ రౌడీ షీటర్ కుమారుడు కోపంతో బోరబండలో తన ఫ్రెండ్స్‌తో కలిసి డానీష్‌ను బీరు సీసాలతో కొట్టి చంపేశాడు. 10 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

News June 29, 2024

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

ఖమ్మం పుట్టకోట క్రాస్ సమీపంలో గురువారం రోడ్డుప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థి కొత్తపల్లి ప్రవీణ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. ముదిగొండ మండల కట్టకూరుకు చెందిన ప్రవీణ్ తనికెళ్ల విజయ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం కాలేజీకి వెళ్లి ఫీజు చెల్లించి బైక్‌పై తిరిగి వస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టిందని తెలిపారు.

News June 29, 2024

తలపై ఫ్యాన్ పడి KU విద్యార్థినికి గాయాలు

image

KU పోతన హాస్టల్‌లో పీజీ ఫస్టియర్ విద్యార్థిని సంధ్య(పోలిటికల్ సైన్స్) తలపై ఫ్యాన్ పడి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆమె తలకు వైద్యులు 18 కుట్లు వేశారు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూంలు సరిగా లేవని, కలుషితమైన నీటిని తాగడానికి ఇస్తున్నారంటూ వాపోయారు.

News June 29, 2024

డీఎస్ మరణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన ఎంపీ అర్వింద్

image

తన తండ్రి D.శ్రీనివాస్ మృతి పట్ల ఎంపీ అర్వింద్ FB ఎమోషనల్ పోస్టు చేశారు. ‘అన్నా అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే..! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు. వారి కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న..! నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు, ఎప్పటికీ మాలోనే ఉంటావు’ అని పోస్ట్ చేశారు.

News June 29, 2024

MNCL: మటన్‌తో పోటీపడుతున్న బోడకాకరకాయ ధర

image

వర్షాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే బోడకాకరకాయ ధర ఆకాశాన్నంటుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బోడకాకరకాయ కిలో రూ.600 అమ్ముతున్నారు. మార్కెట్‌లో ఆ ధర చూసిన కొనుగోలుదారులు అవాక్కయ్యారు. కిలో చికెన్ రూ.240, మటన్ కిలో రూ.800ఉండగా.. బోడకాకరకాయ ధర రూ.600 పలకడం విశేషం.

News June 29, 2024

సూర్యాపేట: అబార్షన్ ఘటనలో ఏడుగురిపై కేసు

image

చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన 7 నెలల గర్భిణి సుహాసిని మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్‌తోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. మూడో కాన్పులో గర్భణి అయిన ఆమెకు భర్త లింగనిర్ధారణ పరీక్షలు చేయించి.. పుట్టబోయేది ఆడబిడ్డగా తెలుసుకొని హుజూర్‌నగర్‌ కమల ఆసుపత్రిలో గర్భవిచ్ఛిత్తి చేయించాడు. దీంతో చికిత్స వికటించి ఆమె మృతి చెందింది.

News June 29, 2024

నాగర్ కర్నూల్: భర్తను చంపిన భార్య

image

భర్తను భార్య కిరాతకంగా బండరాయి, కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నట్లు సీఐ కనకయ్య తెలిపారు. శివశంకర్‌(35) హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శివలీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. శివశంకర్‌కు తన ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. ఆవేశానికి గురైన శివలీల, శివశంకర్‌ తలపై బండరాయి, కర్రతో తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు

News June 29, 2024

చేగుంట: ప్రమాదంలో 250 మేకలు మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులో 44వ జాతీయ రహదారి బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 250 మేకలు మృతి చెందాయి. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మధ్యప్రదేశ్ వాసులు మృతి చెందగా.. లారీలో ఉన్న 460 మేకల్లో సుమారు 250 మేకలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మేకల మండికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

News June 29, 2024

వరంగల్ : పీజీ పరీక్షల షెడ్యూల్ సవరణ

image

కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహచారి, అదనపు నియంత్రణ అధికారి సౌజన్య శుక్రవారం విడుదల చేశారు. జులై 5, 8, 10, 12, 15, 18న ఉంటుందని తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

News June 29, 2024

HYD: నర్సింగ్ అధికారుల పాత్ర కీలకం: ప్రొ.కోదండరాం

image

ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ అధికారుల పాత్ర కీలకమైందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ నర్సింగ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో HYD పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగిన సంఘ రాష్ట్రస్థాయి సదస్సులో కోదండరాం ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ అధికారుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.