Telangana

News June 29, 2024

స్వచ్ఛ కరీంనగర్‌గా తీర్చిదిద్దుదాం: ప్రఫుల్ దేశాయ్

image

కరీంనగర్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, (మున్సిపల్ కమీషనర్) ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని జిల్లా ప్రజలందరు అప్రమత్తతతో, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. మన ఇంటి చుట్టు, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత అని సూచించారు.

News June 29, 2024

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పెండింగ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. బడి మానేసిన పుల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

News June 29, 2024

షాద్‌నగర్ ఘటనలో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి: డీకే అరుణ

image

షాద్‌నగర్ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విచారణ వ్యక్తం చేశారు. పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఘటలో మృతిచెందిన, గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

News June 29, 2024

KNR: విద్యార్థులది గ్రేట్ అచీవ్ మెంట్: కలెక్టర్

image

ఇటీవల నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 483 మంది విద్యార్థులు ఉండగా 432 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 51 మంది హాజరు కాలేదని చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 432 మంది విద్యార్థుల్లో 418 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. జిల్లాలో 96.76 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు.

News June 29, 2024

రిజర్వేషన్ చార్జీల నుంచి మినహాయింపు : RMKMM

image

ప్రయాణికుల తమ రిజర్వేషన్ టికెట్లను 8 రోజుల ముందస్తుగా చేసుకున్నట్లయితే రిజర్వేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరీరామ్ అన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి నాన్ ఏసి స్లీపర్, లహరి ఏసి స్లీపర్, బస్సులలో వర్తిస్తుందని అన్నారు.

News June 29, 2024

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి, ధరణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా సమస్యలకు పరిష్కరం దొరుకుతుందన్నారు. శుక్రవారం ఆయన చందంపేట తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 266 ఫిర్యాదులు స్వీకరించినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.

News June 29, 2024

మావోయిస్టుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

మహారాష్ట్ర, తెలంగాణా సరిహద్దులోని పోలీసులు.. మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మావోల ప్రాబల్యం ఉన్నందున, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News June 29, 2024

సిరిసిల్ల: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

image

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్‌లో గల ఈవీఎం గోదామును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించి, రిజిస్టర్లో సంతకం చేసి అధికారులకు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డిఓ రమేష్, తహసీల్దార్ షరీఫ్, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.

News June 29, 2024

సిద్దిపేట: ‘సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి’

image

సీజనల్ వ్యాధుల వల్ల ప్రబలే అంటూ వ్యాధులపైన క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని DMHO డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. వర్గల్ UPHCని ఆకస్మిక సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జ్వర పీడితులకు తక్షణమే రక్త నమూనాలు సేకరించి చికిత్స అందించాలని, అవసరం ఉన్న సమయంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.

News June 29, 2024

బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి: కలెక్టర్

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ప్రగతిపై బ్యాంకు అధికారులతో చర్చించారు. ఈ ఏడాది పీఎంఈజీపీ కింద యూనిట్లు ఇవ్వడానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.