Telangana

News June 29, 2024

ఉట్నూర్: అధికారులతో ఐటీడీఏ పీఓ సమావేశం

image

ప్రధానమంత్రి జన జాతీయ న్యాయ మహా అభియాన్ పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్లను 15 రోజుల్లో కచ్చితంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల మండల తహసిల్దార్లను ఆదేశించారు. ఐటీడీఏ కోర్ట్ కేసులపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.

News June 28, 2024

వరంగల్: వంగర పర్యాటకం కలేనా!

image

దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడైన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగర పర్యాటకాభివృద్ధి కలగానే మిగిలింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా 2020లో మాజీ సీఎం కేసీఆర్ వంగర గ్రామంలో పీవీ జ్ఞాన వేదిక స్మృతివనం ఏర్పాటుకు రూ.7 కోట్లు మంజూరు చేసినా పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. శుక్రవారం పీవీ 103వ జయంతి సందర్భంగా పనుల నత్తనడకపై గ్రామస్థులు విమర్శలు చేస్తున్నారు.

News June 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్లపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
@ ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో బైక్ ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు.
@ కోరుట్ల పట్టణంలో ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ.
@ ఇబ్రహీంపట్నం మండలంలో దాడికి పాల్పడి చోరీ చేసిన ముగ్గురి అరెస్ట్.
@ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్.

News June 28, 2024

షాద్‌నగర్ పేలుడు.. మృతులు వీరే

image

షాద్‌నగర్ పరిధిలోని పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన నితీష్ కుమార్(22), రామ్ సెత్(24), బీహార్‌కు చెందిన రాంప్రకాష్(31), చిత్తరంజన్(31), ఒడిషాకు చెందిన రతికాంత్ అనే కార్మికులు మృతి చెందినట్లు ఆర్డీవో మాధవరావు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

News June 28, 2024

BREAKING: HYD: శంషాబాద్‌లో విషాదం

image

HYD శంషాబాద్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం బీదర్ వాసి ప్రియాంక(26).. కుమారుడు అద్విక్(3), కుమార్తె ఆరాధ్య(7 నెలలు)తో కలిసి శంషాబాద్ RB నగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో పిల్లలకు విషమిచ్చి ప్రియాంక ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు వచ్చి పిల్లలను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రియాంక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 28, 2024

BREAKING: HYD: శంషాబాద్‌లో విషాదం  

image

HYD శంషాబాద్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం బీదర్ వాసి ప్రియాంక(26).. కుమారుడు అద్విక్(3), కుమార్తె ఆరాధ్య(7 నెలలు)తో కలిసి శంషాబాద్ RB నగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో పిల్లలకు విషమిచ్చి ప్రియాంక ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు వచ్చి పిల్లలను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రియాంక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  

News June 28, 2024

‘ఉమ్మడి జిల్లా నేటి ముఖ్యాంశాలు”

image

√కొడంగల్ అభివృద్ధిపై NRPT,VKB జిల్లా కలెక్టర్ల సమీక్ష.
√ SDNR:భారీ పేలుడు.. ముగ్గురు మృతి.
√ACPT:మాజీ మంత్రి హరీష్ రావుకు అచ్చంపేట MLA సవాల్.
√NGKL:ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి జూపల్లి.
√MBNR:ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం మీదే: పీయూ OSD.
√NGKL: భర్తను చంపిన భార్య.
√ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా EX.PM పీవీ నరసింహారావు జయంతి వేడుకలు.
√SDNR:పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా.

News June 28, 2024

మెదక్ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే..

image

మెదక్ జిల్లా వడియారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల వివరాలు గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాకు చెందిన మేకల వ్యాపారులు చిక్వ రాజు (57), చిక్వ మనీష్ కుమార్(30), కూలీలు ఎండి ఇబ్రహీం(21), ఎండీ షబ్బీర్ ఖాన్(48), ఎండీ జీసన్(21)గా గుర్తించారు. క్షతగాత్రులు రేవా జిల్లాకు రమేష్, మహేష్, శుక్లాల్, మనీలాల్, మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన డ్రైవర్ బుట్టా సింగ్‌గా తేలింది.

News June 28, 2024

ఖమ్మం: రోడ్డు పక్కన శిశువు మృతదేహం

image

పసి గుడ్డును రోడ్డు పక్కన పడేసిన అమానుష ఘటన కూసుమంచి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం నుంచి కోదాడ వెళ్లే 5 నెలల శిశువును రోడ్డు పక్కన ఉంది. మాదిగ కుంట వైపు వెళ్తున్న సతీశ్ అనే వ్యక్తికి శిశువు కనిపించింది. జీపీ సెక్రటరీకి తులసిరాంకీ సమాచారం అందించాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వారు కూసుమంచి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.

News June 28, 2024

SDNR: పరిశ్రమలో పేలుడు.. భయానక దృశ్యాలు

image

షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాసు కంపెనీలో సంభవించిన భారీ ప్రమాదంలో భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. కంప్రెషర్ పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఒక్కొక్క భాగం ఒక్కొక్కచోట ఎగిరిపడ్డాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కార్మిక నేత తెలిపారు. ఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతిచెందగా పలువురు షాద్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.