Telangana

News June 28, 2024

ఉప్పల్‌లో నల్గొండ జిల్లా నిరుద్యోగి సూసైడ్

image

ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి వాసి వెంకట రాముడు(21) HYDకు ఉద్యోగం కోసం వచ్చాడు. ఎంత తిరిగినా జాబ్ రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో రామాంతాపూర్‌లోని తన బావమరిది సాయికిరణ్ ఇంటికి వచ్చి తండ్రికి ఫోన్ చేశాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి చనిపోయాడు.

News June 28, 2024

HYD: ఉప్పల్‌లో విషాదం.. నిరుద్యోగి ఆత్మహత్య

జనగామ: కరెంట్ షాక్‌కు గురై వివాహిత మృతి

image

జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం సూరారం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి వివాహిత మృతి చెందింది. ఎస్సై రవి యాదవ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుప్రియ మధ్యాహ్నం ఇంటి వద్ద పని చేస్తున్న క్రమంలో ఇంట్లోని విద్యుత్ వైరు చేతికి తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 28, 2024

షియా మత పెద్దలతో మంత్రి పొన్నం సమావేశం

image

పవిత్ర మాసంలో నిర్వహించే కార్యక్రమాలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, షియా మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. మొహర్రం కార్యక్రమాలు నిర్వహించే అశుర్ కానాల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అశుర్ ఖానాల పరిసర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు.

News June 28, 2024

విద్యార్థినులకు హృదయ ఆధారిత విద్య అందించాలి: కలెక్టర్ క్రాంతి

image

కస్తూర్బా పాఠశాలలో చదివే విద్యార్థినులకు హృదయ ఆధారిత నైపుణ్య విద్యను అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం కస్తూర్బా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బాలికలకు వారం రోజులపాటు వీటిపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో డీఇఓ వెంకటేశ్వర్లు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ పాల్గొన్నారు.

News June 28, 2024

HYD: బ్లాస్ట్.. చెల్లాచెదురుగా మృతదేహాలు, కాళ్లు, చేతులు..!

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి బూర్గులలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో బ్లాస్ట్ జరిగి ఆరుగురు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాగా ఒక్కసారిగా కంప్రెషర్ గ్యాస్ పేలడంతో కార్మికులు ఎగిరిపడ్డారు. మృతదేహాలు, మాంసపు ముద్దలు, కార్మికుల అవయవాలు, కాళ్లు, చేతులు పరిశ్రమలో చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి పరిస్థితిని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. శంషాబాద్ DCP రాజేశ్ పరిశీలించారు.  

KNR: తల్లి ప్రేమ.. కొడుకు కోసం ఆటో డ్రైవర్‌గా 55ఏళ్ల మహిళ

image

మనవళ్లు, మనవరాళ్లతో ఉండాల్సిన సమయంలో జీవనోపాధికోసం ఆటో నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తోంది కరీంనగర్ జిల్లా కొత్తపెల్లికి చెందిన ఉమా. భర్త కాలం చేయడంతో భర్త వృత్తినే తన వృత్తిగా మలుచుకుంది. 55ఏళ్ల వయసులో ప్రతిరోజు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తోంది. ఆటోలు ఎక్కువ కావడంతో గిరాకీ తక్కువగా అవుతుందన్నారు. బిడ్డ, కొడుకుకు పెళ్లై పిల్లలు ఉన్నారని, కొడుకు కిడ్నీలు పాడవడంతో ఆటో నడుపుతున్నామని చెప్పింది.

News June 28, 2024

HYD: ప్రజావాణి కార్యక్రమానికి 494 దరఖాస్తులు

image

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 494 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేకాధికారిణి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.