Telangana

News June 28, 2024

నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ ఈటల

image

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మల్కాజ్గిరి పార్లమెంటు సమస్యలతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్ద పాపయ్య పల్లి మీదుగా వేస్తున్న సర్వీస్ రోడ్డు నిర్మాణం వలన రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు.

News June 28, 2024

ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం మీదే: ఓఎస్డీ

image

విద్యార్థి దశ నుండి ప్రణాళిక బద్ధంగా చదవడం ద్వారా విజయం మీదే అని పీయూ ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు స్టడీ సర్కిల్ ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలలో ఎక్కడా లేని విధంగా తమ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 28, 2024

NGKL:భర్తను చంపిన భార్య.. కారణం అదే !

image

నాగర్‌కర్నూల్‌లో భర్తను భార్య కొట్టి చంపిన విషయం తెలిసిందే. సీఐ కనకయ్య తెలిపిన వివరాలు.. 15వ వార్డుకు చెందిన శివశంకర్, శివలీల దంపతులు. శివ హమాలీ కూలీ. కాగా భార్య వివాహేతర సంబంధంపై దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో రాత్రి ఇద్దరు గొడవ పడగా పక్కనే ఉన్న రాళ్లు, కర్రలతో కొట్టి భర్తను చంపేసింది. తెల్లవారుజామున స్థానికుల సమాచారంతో పోలీసులు శివలీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News June 28, 2024

సిరిసిల్ల: చిరుత దాడిలో లేగ దూడలు మృతి

image

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో లేగ దూడలపై చిరుతపులి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో లచ్చిరెడ్డి అనే రైతుకు చెందిన రెండు లేగ దూడలు మృతి చెందినట్లు సమాచారం. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా పలుమార్లు చిరుతపులి పాడి పశువులపై దాడులు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఫారెస్ట్ అధికారుల నుంచి ఇలాంటి సమాచారం లేదు.

News June 28, 2024

HYD: ఇంట్లో బిర్యానీ తిని వెళ్లిన దొంగలు..!

image

చోరీకి వచ్చిన దొంగలు ఇంట్లోని బిర్యానీ తిని వెళ్లిన ఘటన HYD బాలాపూర్ PS పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. బాలాపూర్‌లోని నాబెల్ కాలనీలో నివాసం ఉండే ఓ నర్సు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బీరువాలోని నగదు, బంగారం, వెండి నగలు చోరీ చేశారు. ఫ్రిజ్‌లో ఉన్న బిర్యానీని కిచెన్‌లో వేడి చేసుకుని తిన్నారు. ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News June 28, 2024

HYD: ఇంట్లో బిర్యానీ తిని వెళ్లిన దొంగలు..!

image

చోరీకి వచ్చిన దొంగలు ఇంట్లోని బిర్యానీ తిని వెళ్లిన ఘటన HYD బాలాపూర్ PS పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. బాలాపూర్‌లోని నాబెల్ కాలనీలో నివాసం ఉండే ఓ నర్సు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బీరువాలోని నగదు, బంగారం, వెండి నగలు చోరీ చేశారు. ఫ్రిజ్‌లో ఉన్న బిర్యానీని కిచెన్‌లో వేడి చేసుకుని తిన్నారు. ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News June 28, 2024

నిజామాబాద్ : BRS నేతలతో సమావేశమైన కేసీఆర్

image

కామారెడ్డి జిల్లాలోని BRS మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, BRS అధినేత KCRను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ BRS జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.

News June 28, 2024

హన్మకొండలో వృద్ధుడి కాళ్లపై నుంచి వెళ్లిన బస్సు

image

ప్రమాదవశాత్తు వృద్ధుడి కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలైన ఘటన హన్మకొండ బస్టాండ్ వద్ద నేడు చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బస్టాండ్ మూల వైపు నుంచి వృద్ధుడు వెళ్తుండగా బస్టాండ్ లోపలి నుంచి వస్తున్న బస్సు వృద్ధుడి కాళ్లపై నుంచి వెళ్లింది. దీంతో వృద్ధుడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.

News June 28, 2024

HYD: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYD కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులను అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.అలివేలు మంగా ఈరోజు తెలిపారు. ఎకనామిక్స్, హిస్టరీ, రాజనీతి శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు జులై 1వ తేదీ సా.5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 28, 2024

ఆర్అండ్బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

image

ఆర్అండ్బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా రోడ్లు, బ్రిడ్జి పనుల పురోగతిపై చర్చించారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ హైవేపై వున్న రామక్రిష్ణాపురం, సింగన్నగూడెం, కొండమడుగుతో పాటు విజయవాడ హైవేలోని అండర్ పాస్‌లను పూర్తిచేయాలన్నారు.