Telangana

News June 28, 2024

HYD: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYD కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులను అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.అలివేలు మంగా ఈరోజు తెలిపారు. ఎకనామిక్స్, హిస్టరీ, రాజనీతి శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు జులై 1వ తేదీ సా.5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

News June 28, 2024

విషమంగా మోతిలాల్ నాయక్ ఆరోగ్యం

image

గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ ఆరోగ్య పరిస్థితిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ఐదు రోజుల క్రితం మోతిలాల్ నిరుద్యోగుల సమస్యలపై ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. పలువురు ప్రముఖులు మోతిలాల్‌కు ఇప్పటికే మద్దతు తెలిపారు. కాగా గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలని మోతీలాల్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు.

News June 28, 2024

NGKL:భర్తను చంపిన భార్య.. కారణం అదే !

image

నాగర్‌కర్నూల్‌లో భర్తను భార్య కొట్టి చంపిన విషయం తెలిసిందే. సీఐ కనకయ్య తెలిపిన వివరాలు.. 15వ వార్డుకు చెందిన శివశంకర్, శివలీల దంపతులు. శివ హమాలీ కూలి కాగా భార్య వివాహేతర సంబంధంపై దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో రాత్రి ఇద్దరు గొడవ పడగా పక్కనే ఉన్న రాళ్లు, కర్రలతో కొట్టి భర్తను చంపేసింది. తెల్లవారుజామున స్థానికుల సమాచారంతో పోలీసులు శివలీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News June 28, 2024

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ అరవింద్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను శుక్రవారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ ‌కు సంబంధించి పలు అభివృద్ధి పనుల విషయం చర్చించారు.

News June 28, 2024

HYD: జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి ఆయన శుక్రవారం HYD సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వినతి పత్రం అందజేశారు. జాబ్స్ కోసం లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

వరంగల్: అబ్జర్వేషన్ హోమ్‌కు ఇద్దరు మైనర్లు

image

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ఇటీవల పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు ఈరోజు వారిపై జువెనైల్ కోర్టులో ఛార్జిషీట్ ఫైల్ చేయగా.. వారిని ఒకరోజు బాలల అబ్జర్వేషన్ హోమ్‌కి పంపించారు. ఇకపై వాహనాలు నడిపే మైనర్లను పట్టుకుని ఛార్జిషీట్ ఫైల్ చేసి కోర్టు ముందు మైనర్, వారి తల్లిదండ్రులను హాజరుపరుస్తామని పోలీసులు హెచ్చరించారు.

News June 28, 2024

HYD: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో చిన్నారి మృతి

image

HYD శామీర్‌పేట్ మండలం హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్కూల్ ప్రాంగణంలోని నీటి గుంతలో పడి కాన అనే రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. చిన్నారి తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు కాగా వారు HYD వలస వచ్చి హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌ నర్సరీలో పని చేస్తున్నారు. జవహర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.

NLG: పంచాయతీ కార్మికుల వేతన వెతలు

image

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. నెల నెలా సరిగ్గా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికులతోపాటు ట్రాక్టర్ డ్రైవర్లు, వాటర్ మెన్లు, ఇతర సిబ్బంది మొత్తం 2578 మంది పని చేస్తున్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు.