Telangana

News June 28, 2024

సిద్దిపేట: విశిష్ట ప్రతిభావంతులైన చేనేతలకు గుర్తింపు

image

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన చేనేత కార్మికులకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరిట రాష్ట్రస్థాయి పురస్కారాలు ప్రధానం చేస్తామని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి సంతోష్ ప్రకటించారు. చేనేత సహకార, సహకారేతర రంగంలో పనిచేస్తున్న కార్మికులు వచ్చే నెల 10 వ తేదీలోపు దరఖాస్తులను కలెక్టరేట్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

News June 28, 2024

MBNR: పనిచేయని బయోమెట్రిక్ యంత్రాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.

News June 28, 2024

హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్‌ రూ. 132, విత్‌ స్కిన్ కిలో రూ. 191, స్కిన్‌లెస్‌ రూ. 218‌ నుంచి రూ. 230 మధ్య అమ్ముతున్నారు. ధరలు తగ్గడంతో‌ మాంసం విక్రయాలు‌ పెరిగే అవకాశం ఉందని HYD‌ పార్శిగుట్టలోని ఓ వ్యాపారి తెలిపాడు. బోనాల సీజన్‌ కావడంతో‌ ఈ ఆదివారం నుంచే‌ గిరాకీ‌ ఉంటుందన్నారు.

News June 28, 2024

హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్‌ రూ. 132, విత్‌ స్కిన్ కిలో రూ. 191, స్కిన్‌లెస్‌ రూ. 218‌ నుంచి రూ. 230 మధ్య అమ్ముతున్నారు. ధరలు తగ్గడంతో‌ మాంసం విక్రయాలు‌ పెరిగే అవకాశం ఉందని HYD‌ పార్శిగుట్టలోని ఓ వ్యాపారి తెలిపాడు. బోనాల సీజన్‌ కావడంతో‌ ఈ ఆదివారం నుంచే‌ గిరాకీ‌ ఉంటుందన్నారు.

News June 28, 2024

సూర్యాపేట జిల్లాలో మరో ఎత్తిపోతల పథకం!

image

సూర్యాపేట జిల్లాలో మరో సాగునీటి ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకోనుంది. ఈ పథకం ద్వారా 10,233 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు సర్వే పనులు చేపట్టారు. చింతలపాలెం మండలం బుగ్గమాదారం వద్ద ఎత్తిపోతల నిర్మాణానికి రూ.415.5 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.

News June 28, 2024

వరంగల్: నేటి పత్తి ధర ఎంతంటే?

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మళ్లీ తగ్గింది. నేడు క్వింటా పత్తికి రూ.7,160 ధర వచ్చింది. 3 రోజులుగా పత్తి ధరలు చూస్తే బుధవారం రూ.7,090, గురువారం రూ.7,210కి పలికాయి. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ.50 తగ్గింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News June 28, 2024

ఆదిలాబాద్: చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండు చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి ముగ్గురు దొంగలను పట్టుకున్నట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఇటీవల తాంసీ, బేల పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళల మెడలో నుంచి చైన్లు దొంగతనం చేశారు. గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామానికి చెందిన అవినాష్, విభాష్, బజార్హత్నూర్‌కు చెందిన జాదవ్ ప్రదీప్ ముగ్గురితోపాటు ఒక బాల నేరస్థుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బంగారం స్వాధీనం చేశారు.

News June 28, 2024

ఖమ్మం: అగ్గిపెట్టె లేదన్నందుకు దాడి.. కేసు నమోదు

image

అగ్గిపెట్టె లేదని చెప్పినందుకు ఓ వ్యక్తిపై నలుగురు దాడికి పాల్పడ్డారు. కారేపల్లికి చెందిన సిద్దంశెట్టి నాగేశ్వరరావు తన ట్రాక్టర్‌లో డీజిల్ కొట్టించేందుకు బుధవారం రాత్రి సమీపంలోని బంక్‌కి వెళ్లాడు. అక్కడకు బైకులపై చేరుకున్న ఖమ్మం యువకులు రోహిత్, సాయి, అభి, యశ్వంత్ అగ్గిపెట్టె అడిగారు. తన వద్ద లేదని చెప్పడంతో దాడికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 28, 2024

నిజామాబాద్: వ్యభిచార గృహంపై దాడులు

image

నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో రాంమందిరం వెనుక వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం సాయంత్రం కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మెరుపు దాడి చేశారు. దాడిలో ఒక నిర్వాహకురాలితో పాటుగా, బిఎల్‌ఎఫ్ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఓ బాధిత మహిళను సఖి కేంద్రానికి తరలించారు.

News June 28, 2024

వరంగల్‌: పడిపోతున్న పల్లి ధర!

image

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంట సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గుముఖం పడుతోంది. గతేడాది సుమారు 5 వేల ఎకరాల వరకు సాగు చేసిన రైతులు ఈ ఏడాది 4,200 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. దానికి తోడు ఆకుమచ్చ, ఆకు పీల్చే పురుగులు తదితర కారణాలతో వేరుశనగ పంట దిగుబడి తగ్గిపోతోంది. గతేడాది క్వింటా రూ.8 వేల వరకు పలికిన పల్లి ఈ ఏడాది రూ.5 వేల వరకు పడిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.