India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖానాపూర్ మండలం ఐనపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను వరంగల్ కలెక్టర్ సత్య శారద శనివారం రాత్రి సందర్శించారు. గురుకులంలోని విద్యార్థులు, సిబ్బంది హాజరు, తదితర రిజిస్టర్లను, భోజనాన్ని, గదులను పరిశీలించారు. అందుతున్న బోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ వారితో కలిసి ఆటలు ఆడుతూ ఉన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో తదితరులున్నారు.
మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వత తేదీ వరకు స్వీకరిస్తామన్నారు.
ఖమ్మం జిల్లాలో నూతన కార్డుదారులకు కూడా సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం అందించనున్నట్లు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జీ.శ్రీలత తెలిపారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మండల లెవల్ స్టాక్ పాయింట్‌ను శనివారం ఆమె ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్‌లోని బియ్యం నిల్వలను పరిశీలించి, బియ్యం దుకాణాలకు సరఫరా విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
మహారాష్ట్రలోని లాతూర్, కర్ణాటకలోని సాయిగాంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు సింగూరు ప్రాజెక్టుకు
సుమారు లక్ష క్యూసెక్కులు వస్తున్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సింగూర్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు మంజీరాకు విడుదల చేసే అవకాశం ఉన్నందున మంజీరా నది వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపారు.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ పట్ల అప్రమత్తతతో ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. ఇతడు myv3ads అనే అప్లికేషన్‌లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదు కావడానికి తనకు 1,21,000/- రూపాయలకు చెల్లించాలని ఆశ చూపి ఇద్దరు వ్యక్తులను మోసం చేశాడన్నారు.
ఇంట్లో ఫంక్షన్ ఉంటే HYDలో పేదోడు ఓ ఫంక్షన్ చేయాలంటే కొండంత భారంగా మారింది. ఇందుకోసం అప్పు మీద అప్పు చేయాల్సిన పరిస్థితి. HYDలో ఒక ఫంక్షన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువుకు వలస వచ్చిన ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. HYDలో ప్రభుత్వం ప్రతి డివిజన్‌లో కనీసం 2 ఫంక్షన్ హాల్స్ నిర్మించి, తక్కువ ధరకు ఉంచేలా చూడాలని కోరుతున్నారు.
వచ్చే నెల 6న జరిగే గణపతి శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్టాటిక్ క్రేన్లు: 134, మొబైల్ క్రేన్లు: 269, హుస్సేన్‌సాగర్ వద్ద పడవలు 9, డీఆర్ఎఫ్ 16 టీములు, గజ ఈతగాళ్లు: 200, గణేశ్ యాక్షన్ టీమ్స్: 160, పారిశుద్ధ్య కార్మికులు 14,486 మంది, మినీ టిప్పర్లు: 102, జేసీబీలు 125, స్వీపింగ్ యంత్రాలు 30, మొబైల్ టాయిలెట్స్ 309, లైటింగ్ పాయింట్లు 56,187, వైద్య శిబిరాలు 7 ఏర్పాటు చేశారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఆనుకుని దిగువన గల పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంబూషియా చేప పిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్ ను సందర్శించారు. గంబూషియా చేప పిల్లలను పెద్ద సంఖ్యలో పెంచాలని నిర్వాహకులకు సూచించారు.
SRSP పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 1084.5 అడుగులు, 58.357 టీఎంసీల వద్ద నీరు నిలువ ఉంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి శనివారం మధ్యాహ్నం వరకు 4.90 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో 39 ఫ్లడ్ గేట్లతో పాటు వరద కాలువ, కాకతీయ, సరస్వతీ, లక్ష్మి మెయిన్ కెనాల్స్ ద్వారా దిగువకు 6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
భారీ వర్షాలు కురిసి ట్రాక్స్ దెబ్బతిన్న కారణంగా పలు రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ- నాగర్ సోల్, నిజామాబాద్- కాచిగూడ, నాందేడ్- మేడ్చల్, కాచిగూడ- కరీంనగర్, కాచిగూడ- మెదక్, సికింద్రాబాద్- సిద్దిపేట, కరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, సిద్దిపేట- సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేశారు.
Sorry, no posts matched your criteria.