Telangana

News June 28, 2024

బీఆర్ఎస్, బీజేపీ కుమ్ముక్కనడం విడ్డూరం: హరీష్ రావు

image

BRS, BJP కుమ్మక్కయ్యాయని ముఖ్యమంత్రి డిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ గెలిచిందని ప్రశ్నించారు.

News June 28, 2024

పాలెం: అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వాహం

image

పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-2025 విద్యాసంవత్సరానికి డిగ్రీ విద్యార్థులకు భోధించేందుకు అతిథి అధ్యాపకులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ విద్యారాణి గురువారం తెలిపారు. పొలిటికల్ సైన్స్-1, కంప్యూటర్ సైన్స్-1, సంస్కృతం-1, బిఏ(ఎల్)తెలుగు-1, తెలుగు-1పోస్టులకు అర్హత గల అభ్యర్థులు జులై1 సాయంత్రం వరకు చేసుకోవాలన్నారు.

News June 28, 2024

ప్రతి బాలిక చదువుకునేలా చూడాలి: సిక్తా పట్నాయక్

image

ప్రతి బాలిక చదువుకునేలా చూడాలని, బాల్య వివాహాలు అరికట్టేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్లో భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో కలిగే నష్టాలను బాలికల తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో బాలిక మండలి ఏర్పాటు చేసి బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News June 28, 2024

MDK: కార్మికులకు వరం.. లేబర్ కార్డు

image

గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం మంది వివిధ రంగాలకు చెందిన కూలీలు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం కార్మికులకు లేబర్ కార్డును అందించడం జరిగిందని జిల్లా సహాయ కార్మిక అధికారి యాదయ్య అన్నారు. కేవలం రూ.110 చెల్లించి కార్డు పొందవచ్చన్నారు. దరఖాస్తుకు కావాల్సిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాతో పాటు రెండు ఫోటోలతో దరఖాస్తు అందించాలన్నారు. మెదక్ జిల్లాలో 30 వేలు మంది కార్మికులు ఉన్నట్లు తెలిపారు.

News June 28, 2024

NRPT:’నూతన చట్టాల పోలీసులకు అవగాహన కల్పించాలి’

image

వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పించాలని డిజిపి రవిగుప్తా అన్నారు. గురువారం హైద్రాబాద్ నుంచి జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు. నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్షా అధినియం చట్టాలపై ఇప్పటికే వంద శాతం సిబ్బందికి అవగాహన కల్పించినట్లు డీజీపీకి ఎస్పీ వివరించారు.

News June 28, 2024

జేబీ శౌరి ఇంటికి వెళ్లిన డిప్యూటీ సీఎం, మంత్రులు

image

టీపీసీసీ సభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబి శౌరి ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెళ్లారు. వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, టీసీసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News June 28, 2024

తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జండగే రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నేడు వారు మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండింగ్ దరఖాస్తులను, ధరణి రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ధరణి మాడ్యూల్ సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్ డి.రాంప్రసాద్, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.

News June 28, 2024

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై జరిగిన దాడిని ఖండించిన మంత్రి

image

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్‌పై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులపై దాడులు సరికాదని రవాణా శాఖ మంత్రిగా ఉద్యోగులకు అండగా ఉంటానని అన్నారు. కమీషనర్ రమేశ్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసులతో మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. భవిష్యత్తులో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

News June 28, 2024

పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

image

నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీపై గురువారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేపర్ లీక్‌లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

News June 28, 2024

ధరణి సమస్యలు పరిష్కరించండి: రాహుల్‌రాజ్ 

image

జిల్లాలో ధరణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం చిలిపిచేడ్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారుతో ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు చేశారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.