Telangana

News June 28, 2024

జుక్కల్: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన

image

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ నాయకులు నల్లబట్టలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు ఇమ్రోజ్ మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావ్ ఆదేశాల మేరకు నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

News June 27, 2024

HYD: సైబరాబాద్‌లో 18 మంది CIల బదిలీ

image

సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో 18 మంది CIలు బదిలీ అయ్యారు. కూకట్‌పల్లి, మాదాపూర్, చేవెళ్ల, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్ల, రాజేంద్రనగర్, షాద్‌నగర్‌, WPS ఐటీ కారిడార్‌ SHOలు, శంకర్‌పల్లి & మోకిల, జీడిమెట్ల, మాదాపూర్, మైలార్‌దేవ్‌పల్లి డీఐలు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ముగ్గురు స్పెషల్ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్లు, మేడ్చల్ CCSలో ఒకరు, CYB CI సెల్‌లో‌ మరొకరిని బదిలీ చేస్తూ CP అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

News June 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల ఆర్డిఓ ఆఫీసును తనిఖీ చేసిన కలెక్టర్.
@ మెట్పల్లి మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడి మృతి.
@ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుడి రూ.35 లక్షల విరాళం.
@ బోయిన్పల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ కమలాపూర్ మండలంలో స్కూల్ వ్యాన్, కారు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
@ కరీంనగర్‌లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి.

News June 27, 2024

మోత్కూర్‌లో రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి

image

మోత్కూర్ మండలం పాలడుగులో రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వలిగొండ మండలం ఎం.తుర్కపల్లికి చెందిన మాసంపల్లి పరశురాములు (40) భార్యాపిల్లలతో కొన్ని నెలల క్రితం మోత్కూర్ వచ్చి ఎస్బీఐ బ్యాంకు సమీపంలో మహారాణి లేడీస్ బట్టల షాపు నడుపుతున్నాడు.

News June 27, 2024

ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: వల్లూరు క్రాంతి

image

ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

News June 27, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ‘టాప్ న్యూస్’

image

√WNP: సైబర్ నేరాల పట్ల ప్రజల ప్రమాదంగా ఉండాలి:SP.√GDL: బావి తవ్వుతుండగా మట్టి కూలి ఒకరి మృతి.√MBNR: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్.√MBNR: రాజాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం వ్యక్తి మృతి.√SDNR: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి చెందాడని ఆందోళన.√ దౌల్తాబాద్: టీచర్ బదిలీ విద్యార్థుల కన్నీళ్లు.√ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షాలు.

News June 27, 2024

పవర్ కట్టింగ్ కాదు.. టెస్టింగ్ మాత్రమే: టీజీఎన్పీడీసీ

image

హన్మకొండ కలెక్టరేట్‌లో ఈరోజు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతుండగా <<13521309>>పవర్ కట్<<>> విషయమై ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వివరాలు తెలిపింది. హన్మకొండ కలెక్టరేట్‌కు 11కేవీ ఫీడర్‌పై విద్యుత్ సరఫరా బంద్ లేదని ఎక్స్‌లో సంబంధిత అధికారులు తెలిపారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా కలెక్టరేట్‌లో సిబ్బంది ముందస్తు టెస్టింగ్‌లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం అవాస్తవమన్నారు.

News June 27, 2024

NZB: సైబర్ మోసం.. నిందితుడికి జైలు శిక్ష

image

ఓ వ్యక్తి తన గొంతును స్త్రీ గొంతుగా మార్చి బాధితున్ని హనీ ట్రాప్ చేసి డబ్బులు కాజేసిన ఘటన జిల్లాలో వెలుగు చూసింది. ఈ మేరకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో హనీ ట్రాప్‌కు సంబంధించిన నేరంలో నిందితుడిని పట్టుకొని జిల్లా కోర్టులో హాజరు పరచగా, అతనికి జైలు శిక్ష విధించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ వెంకటేశ్వర్ రావు సూచించారు.

News June 27, 2024

నల్గొండ: టవల్ ఆరేస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి

image

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడులో తీవ్ర విషాదం జరిగింది. విద్యుద్ఘాతంతో వీరేందర్, జానయ్య అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దండెంపై టవల్ ఆరేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 27, 2024

జేబీ శౌరి ఇంటికి వెళ్లిన డిప్యూటీ సీఎం, మంత్రులు

image

టీపీసీసీ సభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబి శౌరి ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెళ్లారు. వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, టీసీసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.