Telangana

News June 27, 2024

ఆదిలాబాద్: చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్

image

ఇటీవల తాంసీ, బేల మండలాల్లో పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. చైన్ స్నాచింగ్ ఘటనలు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి అభరణాలతో పాటు ఒక బైకు నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News June 27, 2024

KNR: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్‌డ్ రిజర్వులో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్(51) విధుల్లో ఉండగా గుండె పోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా.. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.

News June 27, 2024

మునగాల వద్ద రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి

image

మునగాల మండల సమీపంలోని మాధవరం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఎస్సై అంజిరెడ్డి వివరాలిలా.. బైక్, కారు ఢీకొన్న ఘటనలో తిమ్మారెడ్డి గూడెంకి చెందిన నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYDకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజిరెడ్డి తెలిపారు.

News June 27, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.65,357 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.32,200, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.24,750, అన్నదానం ద్వారా రూ.8,407 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News June 27, 2024

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వనపర్తి SP

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి అన్నారు. సైబర్ మోసగాళ్ల బారి నుండి ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించే పోస్టర్లను ఆమె గురువారం ఆవిష్కరించారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తులు మాటలు నమ్మకూడదన్నారు. తెలియని మెసేజీలు, క్లిక్ చేయకూడదని అన్నారు. లాటరీ తగిలిందని, లోన్లు వస్తాయంటూ వచ్చే ఫోన్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News June 27, 2024

నిర్మల్: గుర్తుతెలియని శవం లభ్యం

image

బాసర-నిజామాబాద్ రైల్వే మార్గంలో ముఠాపూర్ గ్రామ శివారులో రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని వ్యక్తి(55) మృతదేహం రైల్వే పోలీసులు గుర్తించారు. కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తి శవం కుళ్లిపోయినట్లు, ఒంటిమీద తెలుపురంగు చొక్కా, దోతి ధరించినట్లు వెల్లడించారు.

News June 27, 2024

ఖమ్మం: కత్తులతో బెదిరించి మెడలో బంగారం చోరీ

image

కత్తులతో బెదిరించి మెడలో గొలుసును లాక్కొని వెళ్లిన ఘటన తిరుమలాయపాలెంలో మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బాబురావు తన పామ్ ఆయిల్ తోటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఇద్దరు ఆగంతకులు కత్తులతో బెదిరించి అతని మెడలో ఉన్న 2 తులాల చైను, 6 గ్రాముల బంగారు ఉంగరం ఎత్తుకుపోయారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

News June 27, 2024

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి: మంత్రి

image

వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్‌ను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా వ్యవహరించాలని అధికారులకు మంత్రులు సూచించారు.

News June 27, 2024

NGKL: పెరిగిన పులుల సంచారం

image

కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అడవి పచ్చదనం పెరగడంతో పులుల సంచారం పెరిగింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 40కి పైగా పెద్దపులుల సంచారం ఉండగా, కొల్లాపూర్ నల్లమల అటవీప్రాంతంలోనే 13 నుంచి 16దాకా సంచరిస్తున్నాయి. AP నుంచి TG సరిహద్దులోని అడవి ప్రాంతాల్లో పులులు వస్తున్నాయని, పులుల సంచారం పెరగడంతో అందుకు తగ్గుట్టుగా వసతులు కల్పిస్తున్నామని కొల్లాపూర్ రేంజి అధికారి శరత్ చంద్రరెడ్డి పేర్కొన్నారు.

News June 27, 2024

సీఎం రేవంత్ నివాసానికి జీవన్ రెడ్డి

image

ఢిల్లీలోని రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురువారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సమావేశమయ్యారు. జీవన్ రెడ్డికి పార్టీ హై కమాండ్ తగిన ప్రాధాన్యత ఇస్తుందని, వేరే పార్టీలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.