Telangana

News June 27, 2024

ఢిల్లీలో ఎంపీలు రఘువీర్, చామల నిరసన

image

నీట్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై ఢిల్లీలో నల్గొండ, భువనగిరి ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరసన తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News June 27, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్, డిగ్రీ కళాశాలలు జూన్ 1 నుంచి ప్రారంభం అయ్యాయని కానీ.. 35శాతం స్టాఫ్ గెస్ట్ లెక్చరర్స్ ను రెన్యువల్ చేయలేదని అన్నారు. దీంతో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళుతున్నారని, వెంటనే సమస్య పరిష్కారం చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

News June 27, 2024

NGKL: పెరిగిన పులుల సంఖ్య

image

కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అడవి పచ్చదనం పెరగడంతో పులుల సంచారం పెరిగింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 40కి పైగా పెద్దపులుల సంచారం ఉండగా, కొల్లాపూర్ నల్లమల అటవీప్రాంతంలోనే 13 నుంచి 16దాకా సంచరిస్తున్నాయి. AP నుంచి TG సరిహద్దులోని అడవి ప్రాంతాల్లో పులులు వస్తున్నాయని, పులుల సంచారం పెరగడంతో అందుకు తగ్గుట్టుగా వసతులు కల్పిస్తున్నామని కొల్లాపూర్ రేంజి అధికారి శరత్ చంద్రరెడ్డి పేర్కొన్నారు.

News June 27, 2024

మంత్రి పొంగులేటి తనయుడి ఇంట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీ

image

మంత్రి పొంగులేటి తనయుడు హర్షారెడ్డి ఇంట్లో  కష్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హర్షారెడ్డి రూ.1.7 కోట్ల విలువైన వాచీలను కొనుగోలు చేస్తూ స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. దాదాపు 6 గంటలపాటు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ వాచీలను మహమ్మద్‌ ఫహెర్దీన్‌ ముబీన్‌ అనే వ్యక్తి హాంకాంగ్‌ నుంచి సింగపూర్‌ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.

News June 27, 2024

HYD: విద్యుత్ సమస్యలా.. ఫోన్ చేయండి..!

image

వానాకాలం దృష్ట్యా ఫిర్యాదులు స్వీకరించే కాల్ సెంటర్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా రోజువారీగా 10 వేల కాల్స్‌ను సిబ్బంది స్వీకరిస్తుంటారని.. గాలివానతో అంతరాయాలు తలెత్తితే ఇది 95 వేల వరకు వెళ్తుందని తెలిపారు. విద్యుత్తు అంతరాయాలు తలెత్తినప్పుడు 1912కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయం నుంచి ఈ కేంద్రం పనిచేస్తుంది.

News June 27, 2024

HYD: విద్యుత్ సమస్యలా.. ఫోన్ చేయండి..!

image

వానాకాలం దృష్ట్యా ఫిర్యాదులు స్వీకరించే కాల్ సెంటర్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా రోజువారీగా 10 వేల కాల్స్‌ను సిబ్బంది స్వీకరిస్తుంటారని.. గాలివానతో అంతరాయాలు తలెత్తితే ఇది 95 వేల వరకు వెళ్తుందని తెలిపారు. విద్యుత్తు అంతరాయాలు తలెత్తినప్పుడు 1912కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయం నుంచి ఈ కేంద్రం పనిచేస్తుంది.

News June 27, 2024

బీజేపీలోకి పటాన్‌చెరు ఎమ్మెల్యే..?

image

BRS‌కు మరో షాక్‌ తగలనుందా..?, పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్‌రెడ్డి BJPలో చేరుతారా.. జిల్లాలో అవుననే చర్చ జరుగుతోంది. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనతో పార్టీ మారుతారనే టాక్. జహీరాబాద్‌ మాజీ MP, BJP నేత బీబీ పాటిల్‌తో మహిపాల్‌రెడ్డి సమావేశం కావడంతో ఆయన BJP వైపు అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తన అనుచరులకు చెప్పకుండా ఢిల్లీకి వెళ్లడం సైతం పలు అనుమానాలకు తావిస్తుంది.

News June 27, 2024

NLG: కట్టు తప్పుతున్న కొందరు పోలీసులు

image

జిల్లాలోని కొందరు పోలీసుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. వారి వ్యవహార శైలి మొత్తం పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. క్రమశిక్షణతో ఉండాల్సిన ఖాకీలు కట్టు తప్పుతున్నారు. అక్రమార్జనపై దృష్టి పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు పలు చోట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలదన్నట్లు ఇంకొందరు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల శాలిగౌరారంలో ఎస్ఐ మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన తెలిసిందే.

News June 27, 2024

రాజాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రాజాపూర్ మండల పరిధిలోని నేషనల్ హైవే 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. కుచర్కల్ గ్రామానికి చెందిన యాదయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు.

News June 27, 2024

వరంగల్: రూ.500 పడిపోయిన పసుపు ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి నేడు పసుపు, పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపు రూ.14,159 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ రూ.6010, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చింది. మరోవైపు మక్కలు రూ.2,550 పలకగా.. 5531 రకం మిర్చికి రూ.14,800 ధర పలికింది. మార్కెట్‌లో  పసుపు ధర ఒక రోజు వ్యవధిలోనే రూ.500 తగ్గగా.. పల్లికాయ ధరలు స్వల్పంగా పెరిగాయి.