Telangana

News June 27, 2024

11 ఏరియాల్లో నూతన డీసీసీబీ బ్యాంకులు ఏర్పాటు: ఛైర్మన్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగేళ్ల కాలంలో కొత్తగా 12 డీసీసీబీ బ్యాంకులను ఏర్పాటు చేశామని డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు తెలిపారు. కురవి, మొగుళ్లపల్లి, దేవరుప్పుల, రఘునాథపల్లి, సంగెం, హసన్‌పర్తి, మంగపేట, గీసుగొండ, నర్సింహులపేట, బచ్చన్నపేట, నెల్లికుదురు తదితర 11 ఏరియాల్లో నూతన బ్యాంకుల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.

News June 27, 2024

HYD: మాన్‌సూన్ టీమ్స్ రెడీ..

image

గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నిల్వ నీటితో రోడ్లు చెరువులు అవుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇలా నీటి నిల్వల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఏటా వర్షాకాలంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తుంది.ఈ సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల్లో మాన్‌సూన్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

అలకవీడిన MLC జీవన్ రెడ్డి!

image

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి సర్దిచెప్పింది. ఎమ్మెల్యేల చేరికలు పార్టీకి అవసరమని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీ, కేసీ వేణుగోపాల్‌ నచ్చజెప్పడంతో అలకవీడారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యమిస్తామన్న భరోసాతో ఆయన సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.

News June 27, 2024

HYD: న్యాయవాదుల సహకార సంఘం నూతన డైరెక్టర్ల ఎన్నికలు

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు జంట నగరాల్లోని అన్ని కోర్టుల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ న్యాయవాదుల పరస్పర సహాయక సహకార సంఘం నూతన డైరెక్టర్ల ఎన్నికలు జులై 21న జరగనున్నాయి. ఈనెల 28 నుంచి జులై 4 వరకు నామపత్రాల స్వీకరణ, 6న పరిశీలన, 9న ఉపసంహరణ, 11న పోటీలో మిగిలిన తుది అభ్యర్థుల జాబితా విడుదల, 21న (ఆదివారం) పోలింగ్ ఉంటుంది.

భువనగిరి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన భువనగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో గురువారం చోటుచేసుకుంది. మృతుడు భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఉడత వెంకటేష్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 27, 2024

MBNR: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

మద్యం మత్తులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కుల్కచర్ల మం. ఇప్పయిపల్లిలో జరిగింది. స్థానికుల వివరాలు.. MBNR జిల్లా నవాబ్‌పేట మం. కిషన్‌గూడకు చెందిన మల్లేశ్(24) బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి బైకుపై ఇప్పయిపల్లకి వెళ్లాడు. తాటికల్లు తాగి ఇంటికి వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 27, 2024

లక్ష్మాపూర్‌లో రైతు అనుమానాస్పద మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద రాగుల అశోక్ అనే రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే అశోక్ తలపై గాయం ఉండడంతో భూ వివాదంలో ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రామాయంపేట పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 27, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.17,000, వండర్ హాట్ (WH) మిర్చి రూ.17,500 ధర పలికాయి. కాగా నిన్నటితో పోలిస్తే తేజ మిర్చి రూ.500 పెరగగా.. అన్ని రకాల మిర్చి ధరల్లో నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.