Telangana

News June 27, 2024

HYD: ఎదుగుతున్నాడని ఓర్వ లేక చంపేశాడు..!

image

HYD అల్వాల్ పరిధి కానాజిగూడ ఇందిరానగర్‌లో ఇటీవల హత్యకు గురైన క్యాటరింగ్ వ్యాపారి అన్వర్(45) కేసును పోలీసులు ఛేదించారు. ACPరాములు తెలిపిన వివరాలు.. మధ్యప్రదేశ్ వాసి అన్వర్, ఉత్తరాఖండ్ వాసి మనోజ్(33) కుటుంబాలతో కలిసి HYD వలస వచ్చారు. అయితే తన కళ్ల ముందే అన్వర్ ధనవంతుడు కావడం చూసిన మనోజ్ ఓర్వలేకపోయాడు. ఇటీవల అన్వర్‌కు మద్యం తాగించి తలను గోడకేసి కొట్టి చంపేశాడు. పోలీసులు మనోజ్‌ను అరెస్ట్ చేశారు.

News June 27, 2024

కరీంనగర్: గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు

image

TGPSC గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు. www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొదటి గ్రాండ్ టెస్ట్ జులై 08, 09, రెండో టెస్ట్ జులై 15, 16, మూడో టెస్ట్ జులై 22, 23, నాలుగో టెస్ట్ జులై 30, 31వ తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు.

News June 27, 2024

HYD: ఎదుగుతున్నాడని ఓర్వ లేక చంపేశాడు..!

image

HYD అల్వాల్ పరిధి కానాజిగూడ ఇందిరానగర్‌లో ఇటీవల హత్యకు గురైన క్యాటరింగ్ వ్యాపారి అన్వర్(45) కేసును పోలీసులు ఛేదించారు. ACPరాములు తెలిపిన వివరాలు.. మధ్యప్రదేశ్ వాసి అన్వర్, ఉత్తరాఖండ్ వాసి మనోజ్(33) కుటుంబాలతో కలిసి HYD వలస వచ్చారు. అయితే తన కళ్ల ముందే అన్వర్ ధనవంతుడు కావడం చూసిన మనోజ్ ఓర్వలేకపోయాడు. ఇటీవల అన్వర్‌కు మద్యం తాగించి తలను గోడకేసి కొట్టి చంపేశాడు. పోలీసులు మనోజ్‌ను అరెస్ట్ చేశారు.

News June 27, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో 19.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా వెలుగొండలో 16.0 మి.మీ, గద్వాల జిల్లా కల్లూరు తిమాన్దొడ్డిలో 4.5 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 0.8 మి.మీ, మహబూబ్నగర్ జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 27, 2024

మళ్ళీ పెరిగిన పత్తి ధర… ఎంతంటే!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,00 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,250 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు.

News June 27, 2024

సంగారెడ్డి: కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న తండ్రి హత్య

image

కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న తండ్రిని భార్య హత్య చేసిన ఘటన సంగారెడ్డిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అర్ధరాత్రి మద్యం మత్తులో తండ్రి కుమార్తెను లైంగికంగా వేధిస్తుండడంతో భార్య గొడ్డలితో నరికి చంపింది. అనంతరం తల్లీకుమార్తె పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 27, 2024

MBNR: జిల్లాల వారీగా ఉపాధ్యాయుల పదోన్నతులు ఇలా..

image

ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక పాఠశాల HM,తెలుగు,హిందీ,జీవ,గణిత,భౌతిక,సాంఘికశాస్త్రం,ఆంగ్లం,వ్యాయామ విద్య,ప్రత్యేక విద్య తదితర సబ్జెక్టుల్లో SGTలు SAగా పదోన్నతి పొందనున్నారు.MBNR-450,NGKL-498,
GDWL-266,WNPT-394,NRPT-242 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు SAలుగా పదోన్నతులు పొందనున్నారు.ఇప్పటికే ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు.వెబ్ ఆప్షన్లు పరిశీలించి రాష్ట్ర అధికారులు కొత్త పాఠశాలలను కేటాయించనున్నారు.

News June 27, 2024

నిజామాబాద్: గ్రూప్-2 అభ్యర్థులకు గ్రాండ్ టెస్ట్‌లు

image

టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిజామాబాద్ బీసీ స్టడీ సెంటర్లో గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి గ్రాండ్ టెస్ట్ జులై 08, 09, రెండో టెస్ట్ జులై 15, 16, మూడో టెస్ట్ జులై 22, 23, నాలుగో టెస్ట్ జులై 30, 31వ తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News June 27, 2024

ADB: ఆశల పల్లకిలో MLAలు.. మంత్రి పదవి ఎవరికో..?

image

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రి పదవి ఊరిస్తోంది. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రెండో విడత జరగబోతోందనే ప్రచారం నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి విడత కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా సీతక్క వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరిని పదవి వరిస్తుందోననే ఆత్రుత నెలకొంది.

News June 27, 2024

NLG: ఇక గ్రామ పంచాయతీల్లోనూ ప్రజావాణి

image

గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి నిర్ణయించారు. ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవల వేదిక (విలేజ్ టీం) ఇక్కడ వినతులు స్వీకరించనుంది. ప్రజావాణి నిర్వహణపై గ్రామంలో దండోరా వేయించడంతో పాటు కేబుల్ టీవీల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు.