Telangana

News June 27, 2024

రేపు వరంగల్‌కు సీఎం.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి అక్కడి ఏర్పాట్లను సంబంధిత అధికారులతో పరిశీలించారు. పార్కులో చేపట్టిన పనులు, ఫొటో ఎగ్జిబిట్లను సీఎం తిలకిస్తారని చెప్పారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్ తదితరులు ఉన్నారు.

News June 27, 2024

అచ్చంపేట: లింక్ క్లిక్ చేస్తే అంతే!

image

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేయడంతో ఓ వ్యక్తి రూ. 96 వేలు పోగొట్టుకున్నాడు. అచ్చంపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన బిచ్యానాయక్ ఫోన్‌కు క్రిడెట్ కార్డు పోరుతో ఓ లింక్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 96 వేలు మాయమయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 27, 2024

ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

image

పుట్టుకతోనే అంధురాలు.. కానీ 6ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది నల్గొండకి చెందిన పాలబిందెల శ్రీపూజిత. చదువు పూర్తి చేసి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. 2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందింది. ఆ ఉద్యోగం చేస్తూనే.. గురుకుల లెక్చరర్‌ పరీక్షలకు సిద్ధమైంది. ఏప్రిల్‌లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది.

News June 27, 2024

కార్డులు లేక 10 ఏళ్లుగా ప’రేషన్’

image

ఖమ్మం: కొత్తరేషన్ కార్డుల కోసం పేదకుటుంబాలు కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలనసభల్లో అత్యధికంగా కార్డుల కోసమే దరఖాస్తులు అందజేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి రేషన్‌
కార్డులు ఇవ్వలేదు. అంతకుముందు జారీచేసిన కార్డుల ఆధారంగానే ఆన్‌లైన్‌లో
వివరాలు నమోదు చేశారు. 2021లో జిల్లాలో 12,216 మందికి కొత్త రేషన్‌ కార్డులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీఊసేలేదు.

News June 27, 2024

HYD: రీల్స్ పిచ్చి.. లైక్స్ కోసం ఇలా చేస్తున్నారు..!

image

రీల్స్ పిచ్చి ప్రాణాలు తీస్తున్నా పలువురు యువతలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రమాదకరమైన స్టంట్స్ చేయొద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం కొంత మంది యువత ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా HYDహుస్సేన్ సాగర్ తీరంలో ఓ యువకుడు తన కొత్త బైక్‌ను ఒడ్డు చివరన ప్రమాదకరంగా నిలిపి ఇలా రీల్స్ చేస్తూ కనిపించాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

సిద్దిపేట: 79 మంది కానిస్టేబుళ్లు బదిలీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 78 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ అనూరాధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 27 పోలీస్ స్టేషన్ల పరిధిలో చాల కాలంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఒకే స్టేషన్‌లో దాదాపు ఐదేళ్ల పాటు విధులు నిర్వహించిన వారు బదిలీల ఈ జాబితాలో ఉన్నారు.

News June 27, 2024

శిల్పారామాన్ని సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధుల బృందం

image

మాదాపూర్‌లోని శిల్పారామాన్ని విదేశీ మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. జార్జియా, ఆర్మేనియా, ఇరాన్‌, బెలారస్‌, తుర్క్మెనిస్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, మంగోలియా, కజకిస్థాన్‌ దేశాలకు చెందిన 21 మంది ప్రముఖ మీడియా ప్రతినిధుల బృందం శిల్పారామాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

మెదక్: ఐటీఐఆర్‌ను కేంద్రం మళ్లీ తీసుకురావాలి: జగ్గారెడ్డి

image

కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌‌ను మళ్లీ తీసుకురావాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేTGPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చిన BJP సర్కార్ ITIRను రద్దు చేశారని తెలిపారు. దీన్ని రద్దు చేయకపోతే ఈ పదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు వినతి పత్రం సమర్పిస్తానని ఆయన అన్నారు.