India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుంది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. లింగారం గ్రామానికి జంగమ్మ (35)కు కల్లు తాగే అలవాటు ఉండగా ఆమెను భర్త మందలించాడు. మనస్థాపానికి గురైనా ఆమె అందరూ గాఢ నిద్రలో ఉండగా.. గురువారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
పోతంగల్ మండలం హంగర్గ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరోకరికి తీవ్ర గాయలయ్యాయి. పోతంగల్‌కి చెందిన ఇద్దరు యువకులు బైక్ పై హంగర్గ వెళుతుండగా కుక్క అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నట్టు స్థానికులు తెలిపారు. ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన మరొకరిని ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ ఎంపి డా.కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘డా. కడియం కావ్య.. మీకు హృదయపూర్వక పుట్టినరోజుకు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మీ జీవితం ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను’ అని శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో నేడు జాబ్ మేళా జరగనుంది. వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. శుక్రవారం ఉదయం 9:30 నుంచి వరంగల్‌లోని ఎంకే నాయుడు హోటల్స్, కన్వెన్షన్‌లో ప్రారంభం అవుతుందని మంత్రి గుర్తు చేశారు.
KMM: తిరుమలాయపాలెం మండలంలో 14 కోట్లతో గ్రామాల్లో రోడ్డు అభివృద్ధి పనులకు కార్యాచరణ రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇస్లావత్ తండా, మెడిదేపల్లి, పిండిప్రోలు, తిరుమలయపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అటు రాబోయే 4 సం.లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ప్రపుల్ దేశాయ్ అధ్యక్షతన సెర్ప్ సిబ్బంది (DPMs/APMs/CCs & VOAs) తో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఐ.కె.పి ద్వారా చేపట్టబోయే (138) PPC లలో పారదర్శకంగా తూకం వేయాలని ఆదేశించారు. తేమ శాతాన్ని సరైన విధంగా చూస్తూ, తాలు లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలుకు సంబంధించిన రికార్డ్‌ను డాటా ఎంట్రీని సకాలంలో పూర్తిచేయాలని అన్నారు.
ఖమ్మం టూవీలర్ మెకానిక్‌ల సమస్యలను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ స్వయంగా అడిగితెలుసుకున్నారు. మెకానిక్ షాపుల వద్దకు వెళ్లిన ఆయన వారితో మాట్లాడారు. వారి యూనియన్ ఆద్వర్యంలో చేస్తున్న అనేక కార్యక్రమాలను అధ్యక్షుడు కోండల్ రావు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా వారి సేవలను కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వం పరంగా మెకానిక్‌లకు ఎలాంటి స్కీంలు లేవని వారు చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మఇంటి నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహశీల్దార్లకు పంపించాలన్నారు.
శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెలరోజుల పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30, 30ఎ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.