Telangana

News June 26, 2024

నిజామాబాద్‌‌లో దారుణ హత్య.. వివరాలు ఇవే!

image

నిజామాబాద్‌లో వ్యక్తి <<13508067>>దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని రంజానీ బాబా దర్గా ప్రాంతంలో హాసన్(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి హత్య జరిగిందని, దర్గా నిర్వహణలో వచ్చే డబ్బుల కారణంగా అతడిని హత్యచేసి ఉండవచ్చని సీఐ సురేశ్ అనుమానం వ్యక్తం చేశారు.

News June 26, 2024

పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం: కలెక్టర్ జితేష్ వి పాటిల్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు దోహదపడేలా పౌష్టికాహారం అందిస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పౌష్టికాహారం అందించేందుకు ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నామని, బాలామృతం అందజేస్తున్నామని వివరించారు.

News June 26, 2024

పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం(M) మల్లాపూర్ బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. MNLC డిపోకి చెందిన బస్సు దర్మారం వైపు వస్తున్న బొలేరో ట్రాలీ అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాలీ నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అన్వర్(25)HYD, అఫ్జల్(55)GDK క్యాబిన్‌లో ఇరుక్కొని చనిపోయారు. PDPL CI కృష్ణ, ధర్మారం SI సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News June 26, 2024

HYD: మరదలిని ప్రేమించాడని హత్య

image

హైదరాబాద్‌లో‌ మరో దారుణం వెలుగుచూసింది. బేగంపేట పాటిగడ్డలో ఓ యువకుడిని కత్తులతో నరికి చంపేశారు. తన మరదలిని ప్రేమిస్తున్నాడన్న కోపం‌తో ఇజాజ్‌‌ ముగ్గురు స్నేహితులు ఫిరోజ్, సాహిల్, రెహన్‌‌లతో కలిసి ఉస్మాన్‌ గొంతు కోశారు. ముఖంపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్ ఆధారాలు సేకరించారు. మర్డర్ చేసిన నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.

News June 26, 2024

భూపాలపల్లి: భార్యను హత్య చేసిన భర్త

image

భూపాలపల్లి జిల్లా మల్హర్(M)లో ఓ మహిళను <<13508723>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని అనుసాన్‌పల్లి వాసి సుమత(30), ఆకుదారివాడ వాసి హతిరాంకు పెళ్లైంది. భర్త వివాహేతర సంబంధం కారణంగా తరచూ ఇద్దరికి గొడవలు జరిగేవి. ఈక్రమంలో మంగళవారం ఆమెను చున్నీతో ఉరేసి చంపి, ఒంటిపై ఉన్న బంగారం తీసుకొని ఎవరో హత్య చేసినట్లు చిత్రీకరించాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు CI నరేశ్ కేసు నమోదు చేశారు.

News June 26, 2024

HYD: మరదలిని ప్రేమించాడని హత్య

image

హైదరాబాద్‌లో‌ మరో దారుణం వెలుగుచూసింది. బేగంపేట పాటిగడ్డలో ఓ యువకుడిని కత్తులతో నరికి చంపేశారు. తన మరదలిని ప్రేమిస్తున్నాడన్న కోపం‌తో ఇజాజ్‌‌ ముగ్గురు స్నేహితులు ఫిరోజ్, సాహిల్, రెహన్‌‌లతో కలిసి ఉస్మాన్‌ గొంతు కోశారు. ముఖంపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్ ఆధారాలు సేకరించారు. మర్డర్ చేసిన నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. 

News June 26, 2024

బొగ్గు గనుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం: తమ్మినేని

image

కేంద్రం బొగ్గు గనుల వేలం ద్వారా
ప్రైవేటీకరణకు చేస్తున్న ప్రయత్నాలను ఇండియా కూటమి ఆధ్వర్వంలో అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణా తరగతులను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బొగ్గు గనులను సింగరేణికి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలన్నారు.

News June 26, 2024

HYD: స్వర్ణగిరి ఆలయానికి JBS నుంచి బస్సులు

image

హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి దేవాలయానికి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు గుడ్‌న్యూస్. JBS నుంచి స్వర్ణగిరి దేవాలయానికి నేటి నుంచి డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లు కంటోన్మెంట్ డిపో మేనేజర్ ఎల్. రామ్మోహన్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రెండు బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

News June 26, 2024

HYD: స్వర్ణగిరి ఆలయానికి JBS నుంచి బస్సులు

image

హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి దేవాలయానికి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు గుడ్‌న్యూస్. JBS నుంచి స్వర్ణగిరి దేవాలయానికి నేటి నుంచి డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లు కంటోన్మెంట్ డిపో మేనేజర్ ఎల్. రామ్మోహన్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రెండు బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT

News June 26, 2024

పంచాయతీ కార్యదర్శుల బదిలీకి రంగం సిద్ధం

image

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు సమాచారం తెప్పించుకుని జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 589 జీపీలు ఉండగా గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులు 26 మంది, గ్రేడ్- 2 కార్యదర్శులు 31 మంది, గ్రేడ్-3 కార్యదర్శులు 39మంది, గ్రేడ్-4 కార్యదర్శులు 321 మందితో పాటు ఔట్సోర్సింగ్ కార్యదర్శులు 25, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 135 మంది సహా 577 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.