Telangana

News June 26, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల వివరాలు..

image

ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్-397, నాగర్ కర్నూల్-451, గద్వాల-305, వనపర్తి-310, నారాయణపేట-271 మంది స్కూల్ అసిస్టెంట్(SA) సమాన స్థాయి ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఈ నెల 23న పాత స్థానాల నుంచి విడుదలైనట్లు ఉత్తర్వులు జారీ అవ్వగా.. కొత్త స్థానాల్లో 24 నుంచి విధుల్లో చేరారు. మంగళవారం బదిలీ అయిన వారికి వీడ్కోలు, కొత్త వారికి స్వాగతం పలికారు. ఉపాధ్యాయుడు బదిలీ అవ్వడంతో పలు విద్యార్థులు కన్నీటి పర్వం అయ్యారు.

News June 26, 2024

నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు

image

స్థానిక సంస్థల ఎన్నికలలోపే నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకు అనుగుణంగా పార్టీ విధేయులు.. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నాయకులెవరు అంటూ ఆరా మొదలు పెట్టినట్లు తెలిసింది. దీంతో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నాయకులకు ఆశలు చిగురిస్తున్నాయి. నేతలను ప్రసన్నం చేసుకుంటూనే మరోవైపు గాంధీ భవనం చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

News June 26, 2024

కొనసాగుతున్న ‘భగీరథ’ సర్వే

image

రాష్ట్రప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా తీరుతెన్నులపై చేపట్టిన సర్వే ఖమ్మం జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని 3.20 లక్షల గృహాలకు గాను 11వ తేదీ నుంచి ఇప్పటివరకు 2,13,883 గృహాల్లో సర్వే పూర్తి చేశారు. తద్వారా 70 శాతం పూర్తి కావడంతో ఇళ్ల వారీగా నల్లా కనెక్షన్లు, సరఫరా, వినియోగం తదితర అంశాలను యాప్లో నమోదు చేస్తున్నారు.

News June 26, 2024

నేలకొండపల్లిలో ఆన్ లైన్ స్కీం.. రూ.100 కోట్లు స్కాం

image

ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణలు పెట్టినా నిత్యం ఎక్కడో ఒక్క చోట ఆర్థిక మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ ఆర్థిక మోసం బయటపడింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఓ వ్యక్తి ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ దందా నిర్వహించి డిపాజిటర్లను నిండా ముంచాడు. సుమారు రూ.100 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టగా బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News June 26, 2024

పాఠశాలలో చేరిన SAలు.. SGTల పదోన్నతులపై ఫోకస్

image

స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడంతో అధికారులు ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులకు SAలుగా పదోన్నతి కల్పించడంపై దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 1,734 మంది SAలు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు మంగళవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. పదోన్నతులు పొందనున్న SGTలు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు.

News June 26, 2024

నాగర్‌కర్నూల్‌: ఏసీబీకి దొరికిన వెల్డండ ఎస్సై

image

వెల్దండ SI రవిని అరెస్ట్ చేసినట్లు ACB DSP కృష్ణాగౌడ్‌ తెలిపారు. కల్వకుర్తి తిలక్‌నగర్‌ చెందిన వెంకటేశ్‌ ఇంట్లో ఈనెల 17న జిలిటిన్ స్టిక్స్ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు కాకుండా ఉండేందుకు రూ.50వేలు లంచం డిమాండ్‌ చేయగా బాధితుడు ఈనెల 19న ACBని ఆశ్రయించారు. SI సూచనతో అంబులెన్స్ డ్రైవర్‌ విక్రమ్‌కు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో ఠాణాలో రవిని అరెస్టు చేశారు.

News June 26, 2024

నిజామాబాద్ GGHలో సూపర్ స్పెషాలిటీ సేవలు

image

నిజామాబాద్ GGHలో సూపర్ స్పెషాలిటీ సేవలు సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ తెలిపారు. ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడంతో కామారెడ్డి, నిర్మల్, మహారాష్ట్ర నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో గుండె సంబందిత శస్త్ర చికిత్సలు, రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, యూరాలజీతో పాటు న్యూరాలజీ సేవలు అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

News June 26, 2024

ఆదిలాబాద్: ఈనెల 29 నుంచి పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహాచారి, అదనపు నియంత్రణ అధికారి డా.రాధిక విడుదల చేశారు. మొదటి పేపర్ జూన్ 29న, రెండో పేపర్ జులై 1న, మూడో పేపర్ 3న, నాలుగో పేపర్ 5న ఉన్నట్లు తేలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.

News June 26, 2024

KMM: 29 నుంచి ఎగ్జామ్స్

image

కాకతీయ విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహాచారి, అదనపు నియంత్రణ అధికారి డా.రాధిక విడుదల చేశారు. మొదటి పేపర్ జూన్ 29న, రెండో పేపర్ జులై 1న, మూడో పేపర్ 3న, నాలుగో పేపర్ 5న ఉన్నట్లు తేలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

News June 26, 2024

నకిలీ బంగారంతో రూ.53.89లక్షణ రుణం

image

నకిలి బంగారంతో రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్ అప్రజయిర్‌ను హుజూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్డుకు రిమాండ్ చేశారు. సీఐ చరమంద రాజు తెలిపిన వివరాలిలా.. నేరేడుచర్ల మండలం వైకుంఠపురానికి రాజేశ్ మిర్యాలగూడలో బంగారం దుకాణాన్ని పెట్టాడు. నష్టం రావడంతో అప్పులు తీర్చేందుకు నకిలీ ఆభరణాలు తయారు చేయించి మిత్రులతో కలిసి భారీ మొత్తంలో లోన్ తీసుకున్నాడు.