Telangana

News June 26, 2024

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

image

ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ హెచ్చరించారు. రేగోడ్‌ ఎమ్మార్వో, కస్తూర్బా పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను నిన్న తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. వచ్చే నెలలో అంగన్‌వాడీలో పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. PM విశ్వకర్మ పథకాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తెలియజేశారు.

News June 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాఠశాలకు బంద్‌కు పిలుపు
✓వివిధ శాఖలపై ఖమ్మం & భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ పర్యటన
✓ఇల్లందు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాచలం నియోజకవర్గం లో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన

News June 26, 2024

WGL: రాహుల్ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

image

పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. దేశ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకై పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సత్తా రాహుల్ గాంధీకి ఉందన్నారు. భారత్ జోడోయాత్రతో దేశ ప్రజల్లో రాహుల్ గాంధీ సమైక్యతను నింపారన్నారు.

News June 26, 2024

హైదరాబాద్‌: రాంగ్‌రూట్‌‌లో‌ వెళితే చిక్కినట్లే!

image

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాంగ్‌రూట్‌లో వెళితే ఇక ఉపేక్షించేది లేదని‌ హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ANPR(ఆటో మేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్డదారిలో‌ వెళ్లిన వారి వాహనాలను గుర్తించి చలానాలు విధిస్తారు. IPC 336 సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నారు. SHARE IT

News June 26, 2024

హైదరాబాద్‌: రాంగ్‌రూట్‌‌లో‌ వెళితే చిక్కినట్లే!

image

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాంగ్‌రూట్‌లో వెళితే ఇక ఉపేక్షించేది లేదని‌ హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ANPR(ఆటో మేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్డదారిలో‌ వెళ్లిన వారి వాహనాలను గుర్తించి చలానాలు విధిస్తారు. IPC 336 సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నారు. SHARE IT

News June 26, 2024

KNR: ఈ నెల 29న కొండగట్టుకు పవన్ కళ్యాణ్

image

ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచార సమయంలో కొండగట్టులోనే వారాహి వాహన పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో‌ ఉన్నారు. ఇందులో భాగంగానే‌ ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు.

News June 26, 2024

రక్షిత మంచి నీటిని అందించేందుకు నిధులు కేటాయించాలి: సీతక్క

image

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌తో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద 10 లక్షల గృహాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 53.98 లక్షల గృహాలకు రక్షిత మంచినీరు అందుతుందన్నారు. కొత్తగా ఏర్పాటైన ఆవాసాలకు, కొత్తగా నిర్మించిన గృహాలకు నల్లాల ద్వారా మంచినీటి సరఫరాకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

News June 26, 2024

ప్రాథమిక విద్య కేంద్రాలుగా అంగన్వాడీలు: వాకాటి కరుణ

image

పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రాథమిక విద్య అందించాలని ప్రభుత్వం అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందన్నారు.

News June 26, 2024

ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో భూ సర్వేపై పంచాయతీ కార్యదర్శులు, ఎంఈవోలు, ఐకేపీ సీసీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సర్వేకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులున్నారు.

News June 26, 2024

మహిళల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ విజయేంద్ర

image

మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని MBNR కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. మంగళవారం జిల్లా మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళుతుందని అన్నారు.