Telangana

News June 26, 2024

సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

టైలరింగ్, బ్యూటీ పార్లర్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణకేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 ఏళ్ళలోపు గల గ్రామీణ ప్రాంతాల మహిళలు అర్హులన్నారు. ఆసక్తిగలవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంగారెడ్డిలో తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 26, 2024

ఉట్నూర్ : నాగోబా దేవాలయాల నిర్మాణం పనులు చేపట్టాలి: కలెక్టర్

image

ఉట్నూర్ లోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా ఐటిడిఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరవీరుల స్తూపం, కేస్లాపూర్ నాగోబా దేవాలయాల నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించి మూడునెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ రెండింటి నిర్మాణ పనులకు రూ.2కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు.

News June 26, 2024

KCRను కలిసిన బీఆర్ఎస్ నాయకులు

image

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మంగళవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి KCR ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతం తదితర విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్ తదితరులు ఉన్నారు.

News June 26, 2024

KCRను కలిసిన బీఆర్ఎస్ నాయకులు

image

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మంగళవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి KCR ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతం తదితర విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్ తదితరులు ఉన్నారు.

News June 26, 2024

NZB: పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు: రాష్ట్ర కార్యదర్శి కరుణ

image

అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. జిల్లా కలెక్టర్లతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. పిల్లల పోషక లోపాల నివారణ కట్టుదిట్టమైన చర్యలను చేపట్టి ప్రాథమిక విద్యకేంద్రాలుగా మార్చాలని పేర్కొన్నారు.

News June 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒పార్లమెంట్‌లో ఎంపీగా డీకే అరుణ, మల్లు రవి ప్రమాణ స్వీకారం
✒NRPT: ఫోన్లు పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయండి:SP
✒కొడంగల్‌లో ప్రోటోకాల్ వివాదం
✒NGKL: ఉరేసుకొని బాలుడు సూసైడ్
✒రేపు స్కూళ్ల బంద్ ప్రకటించిన ఏబీవీపీ
✒ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు
✒ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి:GDWL ఎస్పీ
✒ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు కల్పించండి:TWJF

News June 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గోదావరిఖనిలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాల సీజ్. @ ధర్మారం మండలంలో ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీ.. ఇద్దరు మృతి. @ కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనకి చేసిన ఎస్పీ. @ రాయికల్ మండలంలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడి అరెస్ట్. @ చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. @ మెట్పల్లి మండలం మేడిపల్లిలో 2 ఇళ్లలో చోరీ.

News June 25, 2024

కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

image

BRS అధినేత కేసీ‌ర్‌ను ఎర్రవెల్లిలోని వారి నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండేవిఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

News June 25, 2024

ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో భూ సర్వేపై పంచాయతీ కార్యదర్శులు, ఎంఈవోలు, ఐకేపీ సీసీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సర్వేకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులున్నారు.

News June 25, 2024

MBNR: సీఎం ఏర్పాటు చేసిన విందులో జిల్లా ఎమ్మెల్యేలు

image

ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసంలో మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన విందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.