Telangana

News June 25, 2024

అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు: కరుణ

image

అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్, తాగునీరు, టాయిలెట్, వసతులు కల్పించాలన్నారు. జులై మొదటి వారం నాటికి అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య బోధనపై శిక్షణ పూర్తి చేయాలన్నారు.

News June 25, 2024

క్లాస్ రూమ్‌ను ప్రారంభించిన పమేలా సత్పతి, మంచు లక్ష్మి 

image

కరీంనగర్ జిల్లా కోతి రాంపూర్(పోచంపల్లి)లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్‌ను కలెక్టర్ పమేలా సత్పతి,  సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాతృభాషను మరవొద్దని, ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలని సూచించారు. 

News June 25, 2024

రైతు భరోసా పథక అమలుకు పటిష్ట కార్యాచరణ: మంత్రి తుమ్మల

image

ఖమ్మం: రైతు భరోసా పథక అమలుకు పటిష్ట కార్యాచరణ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రైతుల నుండి అభిప్రాయ సేకరణను క్రోడీకరించి, రైతు భరోసా పై కార్యాచరణ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

News June 25, 2024

ఖమ్మం: ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కారించాలి: అదనపు కలెక్టర్

image

ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత గడువులోగా ధరణికి సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలన్నారు. ఈక్రమంలో పరిస్థితులను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు.

News June 25, 2024

ఆదిలాబాద్ : మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తి

image

పాలిసెట్ మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ 3వ రోజు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజుల పాటు జరిగింది. కాగా మంగళవారం 47 మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోగా 47 మంది అభ్యర్థులు హాజరైనట్లు పాలిసెట్ కోఆర్డినేటర్ భరద్వాజ తెలిపారు. మూడురోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్‌లో మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిపారు.

News June 25, 2024

భూపాలపల్లి జిల్లాలో మహిళ హత్య

image

భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఫకీర్ గడ్డాలో ఇస్లావత్ సుమతిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News June 25, 2024

NZB: పీజీ పరీక్షల రీవాల్యుయేషన్ షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం రీకౌంటింగ్ తేదీని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు జులై 1 లోపు ఫీజు చెల్లించాలని సూచించింది. ఒక్కో పేపర్ రివాల్యుయేషన్‌కు రూ.500 చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ పేర్కొన్నారు.

News June 25, 2024

NZB: ‘బదిలీలు పారదర్శకంగానే జరిగాయి’

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల బదిలీల్లో పైరవీలు జరుగుతున్నాయని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై సీపీ కార్యాలయ యంత్రాంగం స్పందించింది. పత్రికల్లో కథనాలు వచ్చిన విధంగా ఎక్కడ అలా జరగలేదు. ఇప్పటి వరకు బదిలీలు పూర్తిస్థాయి పారదర్శకంగా జరిగాయి. మెరిట్ ఆధారంగా మాత్రమే బదిలీలు జరిగాయని ఏదో రకంగా ఊహించుకుని రాయడం పద్ధతి కాదని ఓ ప్రకటనలో పేర్కొంది.

News June 25, 2024

నిజాంసాగర్ ప్రాజెక్ట్ అప్డేట్

image

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు పంటల కోసం ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రధాన కాలువకు 1,037 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వెళ్తోంది. ప్రస్తుతానికి ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో లేదు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1390.33 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.176 టీఎంసీలుగా ఉందని ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.

News June 25, 2024

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రాష్ట్ర మంత్రులు

image

ఢిల్లీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా పార్టీలకు అతీతంగా సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సత్కరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రిని వారు కోరారు.