Telangana

News June 25, 2024

HYD: వైన్స్ మూసివేయాలని డిమాండ్

image

అంబర్‌పేటలోని రఘునాథ్‌నగర్‌లోని ఓ వైన్ షాప్ వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూం ఏర్పాటు చేయడంతో పాటు టేబుల్స్, కుర్చీలు వేసి జనతా బార్లుగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ వైన్ పర్మిట్ రూమ్ నుంచి శబ్దాలతో‌ ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ధూమపానం, మందుబాబుల మూత్ర విసర్జనతో దుర్వాసన వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మం: భార్యని తిట్టాడని వ్యక్తి సూసైడ్

image

ఇంటి యజమాని అవమానించాడనే మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. స్థానిక శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన గోళ్ల జనార్దన్ రావు ఇంట్లో చింతకాయల నాగరాజు (48) తన కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం జనార్దన్ రావు, నాగరాజు భార్య విషయంలో అసభ్యంగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News June 25, 2024

కామారెడ్డిలో టమాట@ రూ.100

image

కామారెడ్డిలో రోజురోజుకి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాట ధర రూ.100, పచ్చిమిర్చి రూ.120, కొత్తిమీరు రూ.150, పాలకూర రూ.80 బీరకాయలు రూ.120, క్యాప్సికం రూ.120 క్యాబేజి రూ.80 పలుకుతుంది. దీంతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 25, 2024

MLG: అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్

image

మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిఎస్పి రాజశేఖర్ రాజు వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్‌కు చెందిన అశోక్ ఓ గిరిజన మహిళపై గత కొద్దిరోజులుగా భయపెట్టి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతే కాకుండా వీడియోలు తీసి ఆమె భర్తకు పంపిస్తానని బెదిరిస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News June 25, 2024

12 పర్యాటక సర్క్యూట్లో అమ్రాబాద్‌కు అవకాశం

image

అచ్చంపేట: పకృతి పర్యాటక అభివృద్ధిపై పర్యాటక శాఖ దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 12 పర్యాటక సర్క్యూట్లు గుర్తించింది. దీంట్లో నల్లమల్ల ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను గుర్తించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన కొండలు, జలపాతాలు , జల వనరులు ప్రాంతాలను గుర్తించి విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నారు.

News June 25, 2024

మార్చి నుంచే జీరో బిల్లులు అమలు: భట్టి విక్రమార్క

image

ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో మార్చి నెల నుంచి గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో బిల్లులు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం రాత్రి మన్ననూరు గ్రామంలో జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ వల్ల ఈ పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో జీరో బిల్లులు అమలు చేయలేదని భట్టి తెలిపారు.

News June 25, 2024

హైదరాబాద్- విజయవాడ రహదారిని త్వరగా పూర్తి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

image

ఢిల్లీలో కేంద్ర జాతీయ రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కారణంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్- విజయవాడ ఆరు లైన్ల జాతీయ రహదారి పనులను పునర్ ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.

News June 25, 2024

హైదరాబాద్‌లో భారీ ప్రక్షాళన

image

HYD డెవలప్‌మెంట్‌‌ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్‌లో ప్రక్షాళన‌ మొదలైంది. GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి, HMDA కమిషనర్‌గా సర్ఫరాజ్, జలమండలి MDగా అశోక్‌ రెడ్డి‌ని నియమించింది. నగరంలోని 6 జోన్లకు కొత్తగా నలుగురు జోనల్‌ కమిషనర్లు వచ్చారు. కూకట్‌పల్లి ZCగా అపూర్వ్ చౌహన్, ఖైరతాబాద్ ZCగా అనురాగ్, ఎల్బీనగర్ ZCగా హేమంత్ పాటిల్, శేరిలింగంపల్లి ZCగా ఉపేందర్ రెడ్డిని నియమించారు.