Telangana

News June 25, 2024

జడ్చర్ల: గొర్రెల కాపరి హత్య కేసులో వీడిన మిస్టరీ

image

గొర్రెల కాపరిని భార్యే హత్య చేయించినట్లు జడ్చర్ల CI ఆదిరెడ్డి తెలిపారు. రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి, చిన్న ఆంజనేయులు(46) దంపతులు. పెద్ద కుమార్తె ఓ వ్యక్తితో చనువుగా ఉండటంతో తండ్రి మందలించాడు. ఈ విషయంలో కుమార్తె, భార్యను కొట్టాడు. దీంతో భాగ్యలక్ష్మి భర్త హత్యకు ప్లాన్ చేసింది. మూడు మేకలు ఇస్తానని కాళ్ల మైసమ్మతో ఒప్పందం చేసుకుంది. ప్లాన్ ప్రకారం ఈ నెల 21న ముగ్గురు కలిసి హత్య చేశారు.

News June 25, 2024

ఖమ్మం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఖమ్మం-మల్లెమడుగు రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.భాస్కరరావు తెలిపిన వివరాలు.. రాపర్తినగర్ వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రైల్వే ట్రాక్ దాటుతుండగా అతణ్ని రైలు ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలోని మృతి చెందినట్లు తెలిపారు. అన్నం ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని శవాగారంలో భద్రపరిచామన్నారు.

News June 25, 2024

BNGR: కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్

image

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన మహేష్ వ్యవసాయ కూలీల పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మహేష్ తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొర్రెల కాపరులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News June 25, 2024

నేరడిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

నేరడిగొండ మండలంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన చుంచు సురేశ్(30), లక్ష్మణ్‌చందా మండలంలోని పార్పెల్లికి చెందిన పెద్ద సాయన్న (50) బైక్ పై వస్తున్నారు. ఈక్రమంలో రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 25, 2024

వరంగల్: ప్రేమ పేరుతో వేధింపులు.. 2ఏళ్లు జైలు

image

బాలికను వేధించిన నిందితుడికి 2ఏళ్ల శిక్ష విధిస్తూ HNK అదనపు కోర్టు జడ్జి అపర్ణాదేవి తీర్పిచ్చారు. ధర్మసాగర్(M) వాసి ఓ బాలికను బంధువైన దిలీప్ ప్రేమిస్తున్నానని వేధించేవాడు. 2018 APL29న బాలికకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బెదిరించడంతో ఇంటి నుంచి వెళ్లింది. బాలిక తండ్రి PSలో ఫిర్యాదు చేయడంతో దిలీప్ ఆమెను ఇంటికి పంపించాడు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు.

News June 25, 2024

ముస్తాబాద్: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి

image

ముస్తాబాద్ మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా ప్రియుడు మృతి చెందాడు. గూడెం గ్రామానికి చెందిన పెంట చందు(23) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించరు అనే భయంతో సోమవారం వీరిద్దరూ కలిసి కరీంనగర్‌లోని ఉజ్వల పార్కులో పురుగు మందు తాగారు. చందు మృతిచెందగా యువతి ఎల్లారెడ్డిపేలలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

News June 25, 2024

జగదేవపూర్: నాటి ప్రభుత్వ టిచరే నేటి విద్యాశాఖ డైరెక్టర్

image

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా నియామకమైన E.వెంకట నరసింహారెడ్డి 1989 DSC ద్వారా జిల్లా ఫస్ట్ ర్యాంకుతో SA మ్యాథ్య్‌గా ఉమ్మడి జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్, జగదేవపూర్ మండలం మునిగడపలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌గా విధులు నిర్వహించారు. అనంతరం GROUP-1 అధికారిగా 1995లో నియామకమై 2017లో IASగా పదోన్నతి పొందారు. ప్రస్తుత ప్రభుత్వంలో పాఠశాల డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

News June 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఇల్లందులో సింగరేణి అద్దె వాహనాల వేలం
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అశ్వరావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓ భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె

News June 25, 2024

MBNR: 1725 ఉపాధ్యాయుల బదిలీ.. ఆన్‌‌లైన్‌లో ఉత్తర్వులు

image

ఉమ్మడి జిల్లాలో ఎట్టకేలకు సోమవారం సాయంత్రం స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులను అధికారులు ఆన్‌‌లైన్‌లో పెట్టారు. MBNR-394, NGKL-446, NRPT-271, WNPT-310, GDWL-304 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో 9,824 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 229 మంది సీనియర్ SAలు, GHMలు పదోన్నతులు పొంది పాఠశాలలో చేరారు.

News June 25, 2024

ఖమ్మం: గృహ జ్యోతి దరఖాస్తులకు అవకాశం

image

గృహ జ్యోతి పథకం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎన్పీడీసీఎల్ ఖమ్మం ఎస్‌ఈ ఏ.సురేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం గతంలో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ ప్రాంత వాసులు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.