Telangana

News August 30, 2025

రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటర్ లిస్ట్ ఇదే

image

స్థానిక సంస్థల ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 526 గ్రామపంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 7,52,254 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 3,76,873 మంది పురుషులు, 3,75,353 మంది మహిళలు, 28 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వార్డుల వారీగా మొత్తం 4,682 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ ఇవాళ్టితో లాస్ట్.

News August 30, 2025

మెదక్: నితన్య సిరి అభినందించిన ఎస్పీ

image

మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి జాతీయ స్థాయి కరాటే పోటీలలో అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఎస్పీ శ్రీనివాస రావు శనివారం తన ఛాంబర్‌లో నితన్య సిరిని సర్టిఫికెట్, మెమెంటో, ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు.

News August 30, 2025

HYD: మెట్రో టైమింగ్స్ పొడిగింపు

image

మెట్రో రైలు టైమింగ్స్ శనివారం ప్రత్యేకంగా పొడిగించారు. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరనుంది. వినాయక మండపాల దర్శనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఎక్కువ సమయం, భక్తి, సౌకర్యం కోసం ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాంటూ మెట్రో ప్రకటించింది.

News August 30, 2025

శేరిలింగంపల్లి: ‘360 లైఫ్‌’ ప్రాజెక్టు నిలిపివెయ్యండి: హైకోర్ట్

image

శేరిలింగంపల్లి ఇజ్జత్‌నగర్‌లో నిర్మిస్తున్న నమిత 360 లైఫ్‌ ప్రాజెక్టు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్, ఎయిర్‌పోర్టు ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం జరుగుతుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపాలను సరిదిద్దకుండానే ఎలా ఉత్తర్వులు జారీ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

News August 30, 2025

NZB: 21 మండలాల్లో 41,098 ఎకరాల పంట నష్టం

image

కురిసిన వర్షాలకు నిజామాబాదు జిల్లాలోని 21 మండలాల్లో 41,098 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసిందని అధికారులు తెలిపారు. ఇందులో 14,663 మంది రైతులకు సంబంధించి 28,131 ఎకరాల వరి, 5,418 మందికి చెందిన 12,054 ఎకరాల సొయా, 382 మందికి చెందిన 565 ఎకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చామని పేర్కొన్నారు.

News August 30, 2025

రంగారెడ్డి: ఆశవర్కర్లు జ్వర సర్వే చేపట్టాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, జ్వర సర్వే చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు ప్రబలే ప్రాంతాలను గుర్తించాలని, ఫాగింగ్, రెసిడ్యుల్ స్ప్రే చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త తొలగించాలని, ఆశవర్కర్లు ప్రతిరోజు 50 ఇళ్లను సందర్శించి జ్వర సర్వే చేపట్టాలన్నారు.

News August 30, 2025

జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు బీజేపీ యత్నం

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో విజయం సాధించాలని బీజేపీ వ్యూహం పన్నుతోంది. రాష్ట్ర అద్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు ఐదుగురి సభ్యులతో మానిటరింగ్‌ కమిటీని ప్రకటించారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, ఎంపీ రఘునందన్‌రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు, HYD సెంట్రల్‌ జిల్లా మాజీ ప్రెసిడెంట్‌ గౌతమ్‌రావును నియమించారు. బూత్ కమిటీ నాయకులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారు.

News August 30, 2025

KPHB: భర్త గొంతు కోసి.. భార్య ఆత్మహత్యాయత్నం

image

KPHB PS పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భర్త రామకృష్ణను భార్య రమ్యకృష్ణ గొంతు కోసి.. అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 30, 2025

NLG: సెప్టెంబర్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

image

వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ – 2025లో పాల్గొనేందుకు SEP 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు www.skillindiadigital.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ పోటీలు యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఎదగడానికి గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు.

News August 30, 2025

దివంగత నేతలకు సంతాపం తెలపనున్న రాష్ట్ర శాసనసభ

image

నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విస్తృత చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఈ సెషన్ ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు సభ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉ.10:30 గంటలకు ఉప్పల్ మాజీ MLA దివంగత బండారు రాజిరెడ్డి, జూబ్లీహిల్స్ MLA దివంగత మాగంటి గోపీనాథ్‌లకు సంతాపం తెలపనున్నట్లు శాసనసభ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి.