Telangana

News June 25, 2024

హైదరాబాద్‌లో సరికొత్త ప్రయోగం

image

HYD వాసులకు గుడ్‌న్యూస్. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 30 వేల మంది నేషనల్ సర్వీస్ స్కీమ్(NSS) వాలంటీర్ల‌ సేవలకు సిటీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం వాలంటీర్ల మొదటి బ్యాచ్‌కు ట్రైనింగ్‌ ఇచ్చారు. ఈ వాలంటీర్లు‌ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో‌ సిగ్నళ్ల వద్ద‌ ఉంటారు. వీరికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ ఉంటుంది. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ‌లో వీరు భాగమవుతారని అధికారులు వెల్లడించారు.

News June 25, 2024

హైదరాబాద్‌లో సరికొత్త ప్రయోగం

image

HYD వాసులకు గుడ్‌న్యూస్. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 30 వేల మంది నేషనల్ సర్వీస్ స్కీమ్(NSS) వాలంటీర్ల‌ సేవలకు సిటీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం వాలంటీర్ల మొదటి బ్యాచ్‌కు ట్రైనింగ్‌ ఇచ్చారు. ఈ వాలంటీర్లు‌ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో‌ సిగ్నళ్ల వద్ద‌ ఉంటారు. వీరికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ ఉంటుంది. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ‌లో వీరు భాగమవుతారని అధికారులు వెల్లడించారు.

News June 25, 2024

వరంగల్: ఈనెల 30 వరకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. ఈ నెల 30 వరకు సంబంధిత వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 45 శాతం, ఇతరులు 50 శాతం అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు.

News June 25, 2024

MBNR: ప్రశాంతంగా డీఏఓ, హెచ్ఐడబ్ల్యూఓ పరీక్షలు

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్- 2,డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలు సోమవారం నుంచి శనివారం వరకు జరుగనున్నాయి. ఈ మేరకు జిల్లాకేంద్రంలో జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, ఫాతిమా స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు 730 మంది పరీక్షకు హాజరయ్యారు.

News June 25, 2024

ఆశిశ్ నెహ్రా ప్రశంసలందుకున్న ఆదిలాబాద్ బౌలర్

image

ఆదిలాబాద్‌కు చెందిన సాయిప్రసాద్ తన బౌలింగ్‌తో భారత మాజీ దిగ్గజ బౌలర్ ఆశిశ్ నెహ్రా ప్రశంసలందుకున్నాడు. SGF అండర్-19 రాష్ట్ర, జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో 2 సార్లు పాల్గొన్నాడు. కాగా ఇటీవల జరిగిన IPL టోర్నీలో మార్కరం, జాన్సన్, గిల్, సాయిసుదర్శన్, సాహా వంటి ఇంటర్‌నేషనల్ బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ వేశారు. ఆఫ్ స్పిన్‌తో వారిని ఆకట్టుకున్న సాయిప్రసాద్‌ను ఆశిశ్ నెహ్ర అభినందించి పలు సూచనలు చేశారు.

News June 25, 2024

బండి సంజయ్‌ని కలిసిన మంత్రి కోమటిరెడ్డి

image

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో సోమవారం ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. పదేళ్లలో తెలంగాణలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయసహకారాలు అందించాలని కోరారు. స్పందించిన మంత్రి రాష్ట్ర అభివృద్ధికి పార్టీలకతీతంగా అండగా ఉంటామని చెప్పారని తెలిపారు. ముఖ్యంగా జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణకు అగ్రస్థానం లభించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

News June 25, 2024

సిద్దిపేట: యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ పేరుతో రూ.13.50 లక్షలు స్వాహా

image

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బెదిరించి రూ. 13.50 లక్షలు కాజేశారు. సైబర్ నేరగాళ్లు ముంబాయి ఇంటెలిజెన్స్, నార్కోటెక్ యాంటీ డ్రగ్ స్క్వాడ్ అధికారులమని బాధితుడి ఫోన్ చేశారు. మీరు డ్రగ్స్ ఐర్లాండ్‌‌కు చేసిన కొరియర్ పట్టుబడిందని, విచారణకు వస్తున్నామని బెదిరించారు. భయపడిన అతను వారు అడిగిన సమాచారం ఇవ్వడంతో ఖాతా నుంచి డబ్బును కాజేశారు

News June 25, 2024

మహబూబ్‌నగర్: బాలానగర్ RIపై సస్పెన్షన్‌ వేటు

image

బాలానగర్ RI వెంకట్ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. అదివారం MRO ఆఫీసులో తలుపులు వేసుకొని రికార్డులు రాస్తున్న ఆర్‌ఐపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే. 4 నెలల క్రితం హేమాదిపూర్ గ్రామంలో చనిపోయిన రైతు పొలాన్ని ఆయన భార్య పేరిట విరాసత్ చేశారు. దీనిపై HYDలో ఉంటున్న రైతు 2వ భార్య ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఆర్ఐ తప్పు ఉన్నట్లు నిర్ధారించి సస్పెండ్ చేసినట్లు సమాచారం.

News June 25, 2024

MBNR: విద్యుత్ అధికారులతో డిప్యూటి సీఎం సమీక్ష

image

ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యుత్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈగలపెంట సమీపంలో ఉన్న జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగం, ఉత్పత్తి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మెరుగైన విద్యుత్ అందించాలని కోరారు.

News June 25, 2024

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలు గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఫెన్సింగ్ వేయించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.