Telangana

News June 25, 2024

మెదక్: ఈనెల 28న జిల్లాస్థాయిలో ఎంపిక పోటీలు

image

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మెదక్ అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు ఆవిష్కరించారు. 28న మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లాస్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9347344440, 9493594388 నంబర్లును సంప్రదించాలని సూచించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు, శ్రీనివాస్, మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డి ఉన్నారు.

News June 25, 2024

సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. డెంగీ, మలేరియా, విష జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు.

News June 25, 2024

NPDCL సీఎండీ అధికారులకు కీలక సూచన 

image

NPDCL కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నోడల్ ఆఫీసర్లు, సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. సోమవారం ఈ కాన్ఫరెన్స్‌లో సీఎండీ మాట్లాడుతూ.. బ్రేక్ డౌన్, ట్రిప్పింగ్‌లు జరిగినప్పుడు ప్రతి చోట ప్రత్యామ్నాయ సరఫరా ఉండేటట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News June 25, 2024

కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కోమటిరెడ్డి భేటీ

image

జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణకు అగ్రస్థానం లభించేలా ప్రత్యేక చొరవ చూపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. తెలంగాణ బిడ్డ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోమవారం వారిని మర్యదపూర్వకంగా కలిసి సత్కరించారు. గత పదేండ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వానికి సహాయసహకారాలు అందించాలని కోరారు.

News June 25, 2024

బోధన్: రద్దు చేసిన రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని వినతి

image

రద్దు చేసిన బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్ రైల్, బోధన్ కరీంనగర్ రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని విద్యార్థి జేఏసీ బోధన్ స్టేషన్ మాస్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ నుంచి నడిచే నిజామాబాద్ కాచిగూడ ప్యాసింజర్ రైలు బోధన్ నుంచి ప్రారంభించాలని, బోధన్ నుంచి ప్రారంభమయ్యే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బోధన్ స్టేషన్లో టికెట్టు ఇవ్వాలని కోరారు.

News June 25, 2024

రంగారెడ్డి: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆందోళన

image

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం వద్ద నిరుద్యోగులు సోమవారం ధర్నాకు దిగారు. డీఎస్సీ షెడ్యూల్ వెంటనే ప్రకటించి, 25వేల పోస్టులు కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. ప్రిపరేషన్‌కి రెండు, మూడు నెలల సమయం కేటాయించాలన్నారు. ఉద్యోగుల ప్రమోషన్స్ వల్ల ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

News June 25, 2024

ఆదిలాబాద్: PM విశ్వకర్మ యోజన పథకానికి 6061 దరఖాస్తులు

image

PM విశ్వకర్మ యోజనపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల జనరల్ మేనేజర్ పద్మభూషణ్ విశ్వకర్మ యోజన గురించి వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 6061 దరఖాస్తులు చేసుకున్నారని అందులో 1820 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. కాగా మిగతా 4241 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

News June 25, 2024

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీలు..!

image

ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీలు పేర్కొన్నారు.

News June 25, 2024

రంగారెడ్డి: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆందోళన

image

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం వద్ద నిరుద్యోగులు సోమవారం ధర్నాకు దిగారు. డీఎస్సీ షెడ్యూల్ వెంటనే ప్రకటించి, 25వేల పోస్టులు కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. ప్రిపరేషన్‌కి రెండు, మూడు నెలల సమయం కేటాయించాలన్నారు. ఉద్యోగుల ప్రమోషన్స్ వల్ల ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు

News June 24, 2024

HYD: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

image

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు కాపాడారు. పర్వత్ నగర్‌లో నివాసం ఉండే సాయికిరణ్(23) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న మాదాపూర్ పోలీసులు గమనించి సాయి కిరణ్‌ను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.