Telangana

News June 24, 2024

భద్రాద్రి: మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సారపాక గాంధీనగర్‌లో మూడేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

పాకాల చెరువులో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి

image

చెరువులో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో జరిగింది. గ్రామానికి చెందిన మురళి పాకాల చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మొసలి అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో మురళికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మురళి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

News June 24, 2024

నాగార్జునసాగర్‌లో వ్యక్తి దారుణ హత్య..

image

నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన రెహమాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. పర్వతనేని నాగేశ్వరరావుకు చెందిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌లో రెహమాన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే కాంప్లెక్స్‌లో శివ పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. రెహమాన్, శివ మధ్య గొడవ జరగగా శివ రెహమాన్ ను హత్య చేసి శవాన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లో పూడ్చి పరారైనట్లు తెలిపారు. 

News June 24, 2024

విజయశాంతికి బండి సంజయ్ బర్త్‌డే విషెస్

image

కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. విజయశాంతి ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని Xలో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి ‘థ్యాంక్యూ సో మచ్ బండి సంజయ్ గారు’ అంటూ రిప్లై ఇచ్చారు.

News June 24, 2024

సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్: మంత్రి

image

సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

News June 24, 2024

తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి: భట్టి

image

తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారిని వేడుకున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ఆయన పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేలతో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ, పంటలు సమృద్ధిగా పండాలని ఆయన ఆకాంక్షించారు.

News June 24, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. వరంగల్ జిల్లా లాస్ట్

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లాలో 632 (85.29 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. హనుమకొండ 8,856 (69.77%), భూపాలపల్లి 521 (68.23%), మహబూబాబాద్ 1,301 (63.56%), జనగామ 1,167 (61.95%), వరంగల్ 1,857 (58.66%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లోనూ వరంగల్ చివరి స్థానంలో నిలిచింది.

News June 24, 2024

నల్గొండ: ఇంటర్ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో నల్గొండ జిల్లాలో 3,994 మంది హాజరవగా2,286 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 57.24గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 2,364 మంది పరీక్ష రాయగా 1,448 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.25గా ఉంది. యాదాద్రి జిల్లాలో 1,835మందికి 1043 (56.84) మంది పాసయ్యారు.

News June 24, 2024

ఖమ్మం: ఇంటర్ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో ఖమ్మం జిల్లాలో 653మంది హాజరవగా319 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 48.85గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 494మంది పరీక్ష రాయగా 230మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 46.56గా ఉంది.

News June 24, 2024

ఆదిలాబాద్: గుర్తుపడితే సమాచారం ఇవ్వండి

image

ఇటీవల రెండు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నిందితుల ఫొటోను పోలీసులు విడుదల చేశారు. బేల, తాంసీ మండలాల్లో మహిళల మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్ చేసిన విషయం తెలిసిందే. స్నాచర్స్‌ను ఎవరైనా గుర్తుపడితే SDPO 8712659914, జైనథ్ సీఐ 8712659916, రూరల్ సీఐ 8712659915 నంబర్లకు సమాచారం ఇవ్వాలని DSP జీవన్ రెడ్డి కోరారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.