Telangana

News June 24, 2024

ఇంటర్‌ ఫలితాలు: హైదరాబాద్‌‌లో పాసైన విద్యార్థుల LIST

image

తెలంగాణ‌లో ఇంటర్‌ సప్లిమెంటరీ‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌ జిల్లాలోని మూడు సెక్టార్‌(HYD-1, HYD-2, HYD-3)లు కలిపి 1st ఇయర్‌లో 42,390 మంది పరీక్ష రాశారు. ఇందులో 23,557 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 32,672 మందికి 10,682 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫస్టియర్‌లో 55.57 శాతం, సెకండియర్‌లో అత్యల్పంగా 32.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

News June 24, 2024

ఫస్టియర్‌లో సంగారెడ్డి, సెకండియర్‌లో మెదక్ FIRST

image

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో మెదక్ జిల్లాలో 3,518 మంది విద్యార్థులకు 1,804(51.28), సంగారెడ్డిలో 9,358కి 5,456(58.03), సిద్దిపేటలో 4,622కి 2,649(57.31) పాసయ్యారు. అటూ సెకండియర్‌ ఫలితాల్లో మెదక్ జిల్లాలో 2,186 మందికి 1,151 మంది(52.65), సంగారెడ్డిలో 5,213కి 2,277(43.68), సిద్దిపేటలో 2,967కి 1,438(48.47) ఉత్తీర్ణత సాధించారు.

News June 24, 2024

ఇంటర్ ఫలితాలు.. గద్వాల ఫస్ట్.. నారాయణపేట లాస్ట్

image

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాయి. ఫస్టియర్‌లో MBNRలో మొత్తం 5933 మంది విద్యార్థులకు 3600(60.66) మంది, GDLలో 2045కి 1244(60.83), NGKLలో 3456కి 1954(56.54), WNPలో 3,512కి 1,965(55.94)NRPTలో 2,487కి 1,242 (49.94) పాసయ్యారు. సెకండియర్‌లో MBNR జిల్లాలో 3,277కి 1,435(43.79), NGKLలో 2,139కి 911 (42.59), NRPTలో 1,648కి 544(33.01), GDLలో 1,158కి 650(56.13), WNPలో 1,818కి 653(35.92) ఉత్తీర్ణులయ్యారు.

News June 24, 2024

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల టాప్

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రథమ స్థానంలో నిలిచింది. జగిత్యాల జిల్లాలో 2,476 (65.57 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరీంనగర్‌లో 5,922 (62.71%), సిరిసిల్ల 1,204 (59.28%), పెద్దపల్లి 1,527 (55.09%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

News June 24, 2024

ఖమ్మం : ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ లో ఖమ్మం జిల్లాలో 9,950 మంది హాజరవగా 6,679 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 67.13గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 4,716 మంది పరీక్ష రాయగా 3,027 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 59.41గా ఉంది.

News June 24, 2024

నల్గొండ: ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ లో నల్గొండ జిల్లాలో 7,459 మంది హాజరవగా 4,962 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 66.52గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 4,565 మంది పరీక్ష రాయగా 2,712 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 59.41గా ఉంది. యాదాద్రి జిల్లాలో 3,007మందికి 1969 (65.48%) మంది పాసయ్యారు.

News June 24, 2024

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ములుగు టాప్

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో రాష్ట్రంలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లాలో 85.29 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.. ములుగు జిల్లా వ్యాప్తంగా 741 మంది పరీక్ష రాయగా.. 632 మంది పాసయ్యారు. 423 మంది బాలురకు గాను 352 మంది(83.22) పాసవ్వగా.. 318 మంది బాలికలకు గానూ 280 మంది(88.05శాతం) పాసయ్యారు.

News June 24, 2024

ఖమ్మం కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య

image

ఖమ్మం కార్పొరేషన్ నూతన కమిషనర్ గా అభిషేక్ అగస్త్య(IAS)ను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సివిల్స్ బ్యాచ్‌‌‌కు చెందిన అభిషేక్ అగస్త్య 38 ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అభిషేక్ అగస్త్య స్వస్థలం జమ్మూకశ్మీర్. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ గా రానున్నారు.

News June 24, 2024

జైపూర్‌లో సెల్ టవర్ ఎక్కి కార్మికుడి నిరసన

image

జైపూర్‌లోని పెగడపల్లి గ్రామంలో పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని ఏస్టీపీసీ కార్మికుడు మధు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే సంబంధిత అధికారులు తనకు రావాల్సిన పీఎఫ్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశాడు.

News June 24, 2024

జనగామ: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

image

జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వర్షిణి(14) అనే 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఈనెల 21న పాఠశాలలో చేర్పించారు. అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.