Telangana

News June 24, 2024

షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కలిశారు. నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివెళ్లారు. ఆయన్ను కలిసి రాజకీయ పరిస్థితులు వివరించారు. పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తాము పనిచేస్తామని తెలిపారు.

News June 24, 2024

చౌటుప్పల్ వద్ద నేషనల్ హైవేపై దారిదోపిడి

image

చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై 65పై దారిదోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఖమ్మంకి చెందిన ఉపేందర్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా కారులో చోరీ జరిగింది. దాబా వద్ద నిద్రించగా గుర్తుతెలియని వ్యక్తుల కారులోంచి రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందంతో పోలీసులు గాలిస్తున్నారు.

News June 24, 2024

ADB: ఆయిల్ ఫామ్ సాగు నిర్వహణ నిధులు విడుదల

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేల మందికి పైగా రైతులు 16 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేశారు. ఇందులో అదిలాబాద్ జిల్లాలో 1,364 ఎకరాలకు రూ.57.27 లక్షలు, నిర్మల్ 4,523 ఎకరాలకు రూ.189.20 లక్షలు, మంచిర్యాల 599 ఎకరాలకు రూ.25.19లక్షలు, ఆసిఫాబాద్ 494 ఎకరాలకు రూ.20.12లక్షలు విడుదలయ్యాయి.

News June 24, 2024

BREAKING: కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి

image

కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతినే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆమెను బదిలీ చేసి సిరిసిల్ల కలెక్టర్‌గా ఉన్న అనురాగ్ జయంతిని బదిలీపై కరీంనగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అనురాగ్ జయంతిని ఖైరతాబాద్ GHMC కార్యాలయంకు జోనల్ కమిషనర్‌గా బదిలీ చేసి పమేలా సత్పతిని కరీంనగర్ కలెక్టర్‌గా నియమించారు.

News June 24, 2024

స్నేహితుడితో గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య

image

మద్యం తాగే క్రమంలో స్నేహితుడితో గొడవపడి చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేకున్నాడు. ఈ ఘటన చేగుంట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. చేగుంటకు చెందిన తిరుపతి, సాయికుమార్(21) ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ స్నేహితుడిపై దాడి చేశాడు. ఆ క్రమంలో స్నేహితుడు గాయడగా భయపడిన సాయికుమార్ స్థానిక ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేకున్నాడు. మృతుడి తలిదండ్రులు గతంలోనే మృతి చెందారు.

News June 24, 2024

HYD: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ

image

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్ రాస్‌‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గత 2 వారాలుగా GHMCకి ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్‌ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.
SHARE IT

News June 24, 2024

HYD: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ

image

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్ రాస్‌‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గత 2 వారాలుగా GHMCకి ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్‌ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.
SHARE IT

News June 24, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 19.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేటలో 18.5 మి.మీ, నారాయణపేట జిల్లా కోటకొండలో 2.0 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 2.0 మి.మీ, గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 24, 2024

ఉమ్మడి జిల్లాలో వరి పంటకు మొగ్గు చూపుతున్న రైతులు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి తర్వాత రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. గతేడాది వన కాలంలో 5.32 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈసారి సుమారు లక్ష ఎకరాల్లో అదనంగా వరి పంట పెరగనుంది. ఏటా రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దొడ్డు రకం వైపు మొగ్గు చూపుతారు. ఈసారి రైతులు సన్నా రకాల వైపు మొగ్గు చూపుతున్నారు.

News June 24, 2024

కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే సంజయ్.. జీవన్ రెడ్డి ఆగ్రహం?

image

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఊహించనివిధంగా ఆయన పార్టీ మారడంతో బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా విస్తుపోతున్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికీ సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తునట్లు సమాచారం. దీంతో జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారట.