Telangana

News June 24, 2024

కేయూ పరిధిలో నేటి నుంచి పరీక్షలు

image

కేయూ బీఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలు నేటి(సోమవారం) నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 24, 26, 28, జులై 1వ తేదీల్లో నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.

News June 24, 2024

కేయూ పరిధిలో నేటి నుంచి పరీక్షలు

image

కేయూ బీఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలు నేటి(సోమవారం) నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 24, 26, 28, జులై 1వ తేదీల్లో నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.

News June 24, 2024

సీఎంను కలిసిన నారాయణపేట కలెక్టర్

image

నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హైదరాబాదులోని రాష్ట్ర ముఖ్యమంత్రి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో చేరా: పోచారం

image

తాను స్వలాభం కోసమో పదవి కోసమో కాంగ్రెస్‌లో చేరలేదని, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. కార్యకర్తల సూచన మేరకు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకే కాంగ్రెస్‌లోకి వెళ్లానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, నియోజకవర్గ అభివృద్దే లక్ష్యమని పోచారం స్పష్టం చేశారు.

News June 24, 2024

నిర్మల్ జిల్లా వాసికి అకాడమి పురస్కారం

image

నిర్మల్ ఉపాధ్యాయునికి జిద్దా ఉర్దూ అకాడమీ పురస్కారం లభించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర) ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మహమ్మద్ ఇంతియాజ్‌కు ప్రతి ఏడాది సౌదీ అరేబియాలోని జిద్దా ఉర్దూ అకాడమీ వారు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. దీంతో జిద్దా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఆయనను హైదరాబాద్‌లో సన్మానించారు.

News June 24, 2024

అన్నదాతలతో రుతుపవనాలు దోబూచులాట

image

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అన్నదాతలతో దోబూచులాడుతున్నాయి. తొలకరి జల్లులతో పులకరించాల్సిన పుడమితల్లి నోళ్లు తెరిచింది. సకాలంలో వర్షాలు కురిస్తే ఈ సమయంలో జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉండేవి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు మెట్ట, మాగాణిభూముల్లో దుక్కులు దున్ని పంటల సాగుకు అనుకూలంగా సిద్ధం చేశారు. అదునులోవర్షాలు పడకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదని రైతులు తెలిపారు.

News June 24, 2024

ధరణి పెండింగ్ ఫైల్స్‌లో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

image

ధరణి పెండింగ్ ఫైల్స్‌ పరిష్కారం వేగవంతం చేయాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. కొనిజర్ల తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసి, పెండింగ్ ధరణి, రిజిస్ట్రేషన్ స్లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఫిజికల్ ఫైల్స్‌ ఆన్లైన్, అప్లోడ్ ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. రిజిస్ట్రేషన్ స్లాట్ల విషయమై దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News June 24, 2024

మహబూబ్‌నగర్ జిల్లా TODAY TOP NEWS

image

☞పలు చోట్ల సీఎం చిత్రపటానికి పాలాభిషేకం☞ఢిల్లీ బయలుదేరిన డీకే అరుణ☞షాద్‌నగర్: ప్రాణం తీసిన చికెన్ ముక్క☞నల్లమలలో ప్లాస్టిక్ వాడకం నిషేదం☞నవాబ్‌పేట్: గంట వ్యవధిలో అన్న, చెల్లెలు మృతి☞NGKL: 8 మందికి పోలీసు సేవా పతకాలు☞ఆదివారం MRO ఆఫీస్‌లో RI.. MLA సీరియస్☞సీఎంను కలిసిన నారాయణపేట కలెక్టర్☞పలుచోట్ల శ్యాం ప్రసాద్ ముఖర్జీకి నివాలులు

News June 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ గంభీరావుపేట మండలంలో గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి. @ రాయికల్ మండలంలో మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం. @ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్ పై దాడి. @ చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. @ వేములవాడ రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జస్టిస్.

News June 23, 2024

రామచంద్రయ్య మృతికి డిప్యూటీ సీఎం నివాళి

image

అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రామచంద్రయ్య మృతి పట్ల ఆయన నివాళులర్పిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను జీవనాధారంగా చేసుకొని డోలు వాయిద్యానికి రామచంద్రయ్య దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించి పెట్టారన్నారు.