Telangana

News June 23, 2024

నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చెయ్యాలి: సీఎం

image

నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హైదరాబాదులోని రాష్ట్ర ముఖ్యమంత్రి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

News June 23, 2024

MDK: ఫసల్ ప్రీమియం బాధ్యత ప్రభుత్వానిదే !

image

‘ఫసల్’ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమావేశం సంగారెడ్డిలో మే 23న జరిగింది. ప్రీమియం భారం మొత్తం ప్రభుత్వమే భరించనుంది. గ్రామ యూనిట్‌గా వరి, మొక్కజొన్న, మండలం యూనిట్‌గా పత్తిని గుర్తించారు. రైతుల అభిప్రాయం తీసుకున్న కలెక్టర్లు తర్వలో మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో సుమారుగా 14 లక్షల ఎకరాల్లో పంట సాగు కానుంది.

News June 23, 2024

NZB: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీలో (35) వ్యక్తి మృతదేహం ఒంటి నిండా గాయాలతో ఆదివారం లభ్యమైంది. అతడు డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వర్షం ధాటికి అతడు డ్రైనేజీలో పడి మృతి చెందాడా.? లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సదరు వ్యక్తిపై దాడి చేసి డ్రైనేజీలో పడేశారా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 23, 2024

HYD: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు

image

ప్రేమిస్తున్నాను అంటూ ఇంటర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన యువకుడి పై నారాయణగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఖలీల్ నారాయణగూడలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి ప్రేమిస్తున్నానని చెప్పి అత్యాచారం చేశాడు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖలీల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు

News June 23, 2024

HYD: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు

image

ప్రేమిస్తున్నాను అంటూ ఇంటర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన యువకుడి పై నారాయణగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఖలీల్ నారాయణగూడలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి ప్రేమిస్తున్నానని చెప్పి అత్యాచారం చేశాడు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖలీల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు.

News June 23, 2024

నకిరేకల్, నల్గొండ నాకు రెండు కళ్లు: మంత్రి కోమటిరెడ్డి

image

తాను అధికారంలో ఉన్నా లేకున్నా చచ్చేంత వరకు ప్రజల్లోనే ఉండి ప్రజాసేవకే తన జీవితం అంకితం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చిట్యాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లతో సమానమన్నారు. తన రాజకీయ ప్రస్థానం చిట్యాల నుంచే ప్రారంభమైందని, చిట్యాలకు తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు.

News June 23, 2024

HYD: మైనర్లు డైవింగ్ చేస్తే.. వాహన యజమానులకు జైలు శిక్ష

image

వాహన యజమానులూ తస్మాత్ జాగ్రత్త.. ఇకపై వాహనాలు నడుపుతూ మైనర్లు రోడ్ల మీదకు వస్తే బైక్ యజమానులపై కేసులు తప్పవని సిటీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే ఆ వాహన యజమానికి 3 నెలల జైలు శిక్షతోపాటు, రూ.5వేల జరిమానా విధించనున్నట్లు సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు.

News June 23, 2024

పాలకుర్తి: ఇక్ష్వాకుల కాలం నాటి నాణెం లభ్యం

image

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారులోని పాటిగడ్డమీద తండాలో ఓ పురాతన నాణెం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. ఇక్ష్వాకుల కాలంలో ముద్రించిన ఈ నాణెంపై గుర్రం గుర్తుతో పాటు అర్ధ వృత్తాకారం బ్రహ్మలిపిలో ఉందని చరిత్రకారుడు రత్నాకర్ రెడ్డి తెలిపారు. గుర్రం గుర్తు ఉన్న వీటిని ‘మహా తలవర నాణేలు’ అంటారని పేర్కొన్నారు.

News June 23, 2024

పటాన్‌చెరు: రూ.1.05 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ వస్తుందని ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ.1.05 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. పటాన్‌చెరు పోలీసులు తెలిపిన వివరాలు.. గోకుల్‌నగర్ చెందిన ఓ వ్యక్తికి జూన్ 14న టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ ఇస్తామంటూ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అతను వివరాలు నమోదు చేసి దఫదఫాలుగా రూ.1.05 లక్షలు జమ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తి స్పందించలేదు. మోసపోయానని బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

News June 23, 2024

HYD: భాజపా రాష్ట్ర కార్యాలయంలో బలిదాన్ దివస్ కార్యక్రమం

image

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, విజయ రామారావు తదితరులు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.