India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోషామహల్ MLA రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ PSలో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతుండగా ‘భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తే లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశారు.
కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మెర్రీ అనే 36 ఏళ్ల మహిళను హైడ్రా DRF బృందం సకాలంలో కాపాడింది. బాలానగర్‌కు చెందిన ఆమెను గమనించిన స్థానికులు హైడ్రాకు సమాచారం అందించగా, DRF సిబ్బంది తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
HYDలోని నాలుగైదు MMTS ట్రెన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం త్వరలో అన్ని MMTS ట్రెయిన్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే MMTS స్టేషన్లలో కూడా కెమెరాల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.
అనుముల ఇంటెలిజెన్స్ వాడి కులగణనను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదన్నారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినప్పటికీ వివరాలు వెల్లడించలేదన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 15.20% వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయంగా నిలిచి రికార్డు సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. మే 23వ తేదీ వరకు వారానికి 2 సార్లు ఈ ట్రైన్ సేవలందిస్తుంది. చర్లపల్లి నుంచి (07017) శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి (07018) శని, సోమవారాల్లో నడుస్తుంది. మల్కాజిగిరి, కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్‌నగర్, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి నుంచి రాత్రి 9.35కు, తిరుపతి నుంచి సాయంత్రం 4.40కు బయలుదేరుతుంది.
శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్‌గడి మలక్‌పేట్ హైవేపై సఫారీ, కారు డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్‌కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్‌కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్‌గా పోలీసులు గుర్తించారు.
బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి నేడు మన్సూరాబాద్‌లో ప్రమాణం చేయనున్నట్లు కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు AVNరెడ్డి, మల్క కొమురయ్య హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ మహాసభ విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.