RangaReddy

News September 30, 2024

HYD: వర్సిటీగా మారనున్న SBTET సాంకేతిక మండలి!

image

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం VKB జిల్లా కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా మార్చారు. తాజా మంత్రివర్గ సమావేశంలో మరో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కూడా మార్చాలని నిర్ణయించింది. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుతం SBTET సాంకేతిక మండలి పర్యవేక్షిస్తుంది. ఈ బోర్డుకు ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలేషన్ ఇవ్వడానికి వీలు ఉండదని భవిష్యత్తులో వర్సిటీగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తుంది.

News September 30, 2024

HYD: తెలుగు యూనివర్సిటీలోనే IIHT

image

నాంపల్లిలోని IIHT తెలుగు యూనివర్సిటీలో కొనసాగుతుంది. మొదటి ఏడాది 55 మందిని మెరిట్ ప్రాతిపదికన అధికారులు ఎంపిక చేశారు. సాంకేతిక డిప్లమా కోర్సులో చేనేత, జౌళి,ఆపరేటర్, ఫ్యాషన్ సెక్టార్, ప్రొడక్షన్ డిజైనింగ్, వేవింగ్, డయ్యింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్‌పై శిక్షణ అందించి డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు. రాబోయే రోజుల్లో IIHT స్కిల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తారు.

News September 30, 2024

RR: 60 చెరువుల్లో భారీ ఆక్రమణలు..!

image

HMDA పరిధిలోని HYD, RR, MDCL, భువనగిరి, సంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట మొత్తం 7 జిల్లాల్లో 3,532 చెరువులు ఉన్నాయి. పలు చెరువుల సర్వే పూర్తయింది. గ్రేటర్ HYDలో అనేక చెరువుల రూపురేఖలు కోల్పోయాయని భారత రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తెలిపింది. గ్రేటర్‌లో 60 చెరువుల్లో భారీ ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల తప్పుడు సర్వే నంబర్లు ఉపయోగించి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం ఉండడంతో నిఘా పెట్టారు.

News September 30, 2024

HYD: నేడు అత్తాపూర్‌కు కేటీఆర్ రాక

image

మూసీ నిర్వాసితులను పరామర్శించడానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం అత్తాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీ, నందనవనం అపార్ట్‌మెంట్స్‌కు రానున్నారని ఆ పార్టీ నేత కొలను సుభాష్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారని పేర్కొన్నారు.

News September 30, 2024

HYD: విదేశాల్లో చదువుకునేందుకు BEST CHANCE

image

మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకం కింద అర్హులైన HYD, RR, MDCL, VKBలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబర్ 15లోగా ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. 35 ఏళ్లు, ఇంజనీర్, మేనేజ్మెంట్ సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సెన్స్, అగ్రికల్చర్లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు. విదేశీ వర్సిటీల నుంచి ఐ-20 ఫామ్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 30, 2024

HYD: నిరుపేద రోగుల కోసం NIMSలో వెల్ఫేర్ ఫండ్

image

HYD పంజాగుట్ట NIMSలో NIMS పేషెంట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో దీనిని ఆమోదించారు. ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, రూ.1 నుంచి రూ.కోటి వరకు విరాళం అందించవచ్చు. ఈ నిధితో తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న నిరుపేదలకు వైద్యం, ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి పార్థీవదేహాలను సొంత ఊర్లకు తరలించనున్నారు.

News September 30, 2024

HYD: పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల KTR సంతాపం

image

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జ్వరంతో బాధ పడుతూ రాలేకపోయినని Xలో వివరించారు.

News September 29, 2024

BREAKING: రేపు మూసి బాధితుల వద్దకు కేటీఆర్

image

రేపు మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్‌లో సమావేశం అనంతరం మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడలో పర్యటించనున్నారు. తర్వాత అత్తాపూర్‌లోని కిషన్‌బాగ్ ప్రాంతాల్లోని మూసీ ప్రాజెక్ట్‌తో నష్టపోతున్న ప్రజలను కలవనున్నారు.

News September 29, 2024

HYD: మూసీ భాదితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం: మంత్రి

image

మూసి నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లను కాపాడే భాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సొంత నివాసం లేని వారికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, పేదలని కన్నబిడ్డల్లాగా చూసుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను బెస్ట్ సిటీగా నిర్మిస్తామని తెలిపారు.

News September 29, 2024

HYD: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత..!

image

HYDలోని 691 ప్రభుత్వ పాఠశాలలో 1,12,650 మంది విద్యార్థులు ఉండగా.. వీరికి 4,265 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల పరిధిలో అనేక పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. 10వ తరగతి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా మారింది. ఇకనైనా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.