RangaReddy

News September 29, 2024

సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్

image

సికింద్రాబాద్, కాచిగూడ సెక్షన్ ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దాదాపు 273 కిలోమీటర్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 11న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకదానికొక రైలు ఎదురుగా ఢీకొంది. అలాంటివి పునరావృతం కాకుండా ఈ రక్షణ చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ కవచ్ యంత్రాలు దాదాపు 28 స్టేషన్లో ఏర్పాటు చేశారు.

News September 29, 2024

HYD: సబ్సిడీ రాలేదా..? వెంటనే కాల్ చేయండి!

image

HYD, RR, MDCL, VKB మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సబ్సిడీ సంబంధించిన పత్రాలు ఇప్పటికే చాలా మందికి జారీ అవ్వగా.. సబ్సిడీ లబ్ధి కూడా పలువురికి అందుతుంది. అయితే సిలిండర్ డెలివరీ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాల్లో 4 రోజుల్లో జమకాకుంటే వెంటనే 1967, 1800-4250-0333 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

News September 29, 2024

HYD: పోలీసన్నకు ఎంతటి కష్టం..

image

ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడే పోలీసన్న పరిస్థితి చూసి పలువురు కంటతడి పెట్టారు. పోలీసుల వివరాలు.. యూసుఫ్‌గూడ 1వ బెటాలియన్‌లో పోలీసు అధికారి జనార్ధన్ శ్వాస సమస్యతో ఓ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆరోగ్య భద్రత కార్డు ఉన్నా.. యాజమాన్యం చికిత్సకు అంగీకరించలేదు. అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. హెల్త్ కార్డ్ ఉన్నా తమకు తగిన గుర్తింపులేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

News September 29, 2024

HYD: రూ.650 కోట్లతో కట్టుదిట్టంగా నాలా వ్యవస్థ

image

సీఎం రేవంత్ HYD నగరంలోని నాలాల వ్యవస్థను తక్షణమే సంస్కరించాలని నిర్ణయించారు.మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌తో ప్రత్యేక ప్రణాళికతో వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. నాలా పనుల కోసం రూ. 650 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. అక్రమణల కారణంగా, నాలాల వెడల్పు 50 అడుగుల నుంచి 10 అడుగులకు చేరుకుంది. వీటిని తొలగించేందుకు హైడ్రాకు బాధ్యత అప్పగించనున్నారు.

News September 29, 2024

HYD: రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తుల రెక్కీ

image

HYD గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. అనుమానితుల ఫోనులో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిని ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 29, 2024

HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!

image

PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.

News September 29, 2024

HYD: భూముల సేకరణలో TDR జారీకి కసరత్తు..!

image

HYD మీరాలం చెరువుపై చింతల్ మెట్ నుంచి బెంగళూర్ వైపు వెళ్లే రోడ్డు వరకు 2.5KM వంతెన నిర్మాణంలో ప్రైవేటు స్థలాలను సేకరించాల్సి ఉంది. ప్రైవేటు భూములకు పూర్తిగా TDR జారీ చేసేందుకు HMDA అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మియాపూర్ నుంచి గండిమైసమ్మ మార్గంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ, శివారు మున్సిపాలిటీల్లోని పనులకు TDR జారీ చేయనున్నారు.

News September 29, 2024

HYD: పింక్‌ పవర్‌ రన్‌.. పాల్గొన్న ఐటీ ఉద్యోగులు

image

HYD గచ్చిబౌలి స్టేడియంలో పింక్‌ పవర్‌ రన్‌ 3కే, 5కే, 10కే పింక్‌ పవర్‌ రన్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్‌ పవర్‌ రన్‌ నిర్వహించారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌లో స్థానం సంపాదించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

News September 29, 2024

HYD: గాంధీలో పరిశోధనకు రచయిత్రి పార్థివదేహం

image

ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విజయభారతి HYD సనత్‌నగర్‌లో కన్నుమూశారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన ఈమె.. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జా తారకం సతీమణి. 20కి పైగా పుస్తకాలు రాసి,ఎన్నో పురస్కారాలు పొందారు.ఈమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. భారతి పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి నేడు అందించనున్నారు.

News September 29, 2024

ఓయూ: 30న PDSU స్వర్ణోత్సవాల మహాసభ

image

PDSU స్వర్ణోత్సవాల మహా సభను ఈ నెల 30న ఓయూలో నిర్వహించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు PDSU రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, ఆజాద్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వర్ణోత్సవ మహాసభలకు ముఖ్య వక్తలుగా ముంబై హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జీబీ కోల్సేపాటిల్ హాజరవుతారని పేర్కొన్నారు.