RangaReddy

News September 29, 2024

VIRAL: హైదరాబాద్‌లో సరస్సులు.. ఎంత బాగుండేనో..!

image

HYDRAA కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో 1879లో రూపొందించిన హైదరాబాద్ సరస్సుల చారిత్రక చిత్రాలు వైరల్ అయ్యాయి. పరిశోధకుడు అసిఫ్ అలీ ఖాన్ ఈ చిత్రాలను పంచుకుని నగరానికి చెందిన పూర్వ చరిత్రను వెలుగులోకి తెచ్చారు. హుస్సేన్ సాగర్, మిర్ ఆలమ్ ట్యాంక్, సరూర్ నగర్ సరస్సులపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కలుషితమైన ఈ సరస్సులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

News September 29, 2024

అక్టోబర్ 1 నుంచి ఓయూ పీజీ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షలను వచ్చే నెల 1 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంకామ్ (ఐఎస్), ఎంఎస్ డబ్ల్యూ, ఎంలిబ్ఎస్సీ, ఎంజేఅండ్ఎంసీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను 1వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు.

News September 28, 2024

HYD: స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి

image

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.

News September 28, 2024

డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ దర్శనం క్యాన్సిల్ చేసుకున్నాడు: బండి

image

తిరుమల దర్శనం కోసం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే ఏపీ మాజీ సీఎం జగన్ దర్శనాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుత పరిణామాలు, జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే లడ్డు అపవిత్రత అయిందని అనిపిస్తుందన్నారు.హిందూ మతంపై దాడి జరిగినప్పుడు కేవలం RSS, VHP లాంటి సంస్థలే పోరాడుతాయని ఊరుకుంటే సరిపోదని, ప్రతి ఒక్క హిందువు కొట్లాడాలన్నారు.

News September 28, 2024

జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు భారం తగ్గేలా చర్యలు

image

ఏళ్లుగా HYD నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా దానికి భారం తగ్గించేందుకు GHMC ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను గుర్తిస్తోంది. RRజిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారంలో 100, దుండిగల్‌లో 85, మల్కాపూర్‌లో 200ఎకరాలను గుర్తించింది.

News September 27, 2024

HYD: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!

image

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ.. బతుకమ్మ పండుగకు ముందు 9, 5, 3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్‌.. బిడ్డాలెందరూ కోల్‌’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ ప్రాంతంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.

News September 27, 2024

HYD: బాపూజీ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక: సీపీ

image

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బాపూజీ అని పేర్కొన్నారు. ఆయన కృషికి గుర్తుగా ఇటీవల ప్రభుత్వం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి వారి పేరు పెట్టినట్లు గుర్తు చేసుకున్నారు.

News September 27, 2024

HYD: ఈడీతో భయపెట్టాలని చూస్తే నడవదు: మహేశ్‌గౌడ్

image

బీజేపీ, బీఆర్ఎస్ సలహాల మేరకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ రైడ్స్ చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసిందని, ఈడీతో భయపెట్టాలని చూస్తే తమ వద్ద నడవదన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

News September 27, 2024

Tourismకు కేరాఫ్ హైదరాబాద్!

image

పర్యాటక రంగానికి కేరాఫ్ మన హైదరాబాద్. విదేశీయులు సైతం నిత్యం నగరాన్ని సందర్శిస్తుంటారు. చార్మినార్, గోల్కొండ, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, 7 టూంబ్స్, ట్యాంక్‌బండ్, పాతబస్తీలోని చెక్కు చెదరని పురాతన కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి‌, నూతన సెక్రటేరియట్‌ నగరంలో కొత్త టూరిస్ట్ స్పాట్‌లుగా పేరొందాయి. మరి HYDలో మీకు నచ్చిన బెస్ట్ స్పాట్ ఏంటో కామెంట్ చేయండి.

News September 27, 2024

Rewind: మూసీ వరదలకు 116 ఏళ్లు!

image

HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్‌ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.